Share News

కేసీఆర్ మరణాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ కోరుకోలేదు: మహేశ్ గౌడ్

ABN , Publish Date - Sep 09 , 2026 | 01:26 PM

మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ మరణాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ కోరుకోలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

కేసీఆర్ మరణాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ కోరుకోలేదు: మహేశ్ గౌడ్
Mahesh Kumar Goud

హైదరాబాద్, సెప్టెంబర్ 9: మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ మరణాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ కోరుకోలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈరోజు(బుధవారం) అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. కేసీఆర్‌కు చెడు జరగాలని ఎమ్మెల్యే హరీశ్ రావు పూజలు చేశారని స్వయంగా కవిత చెప్పారని అన్నారు. తాము ఏరోజూ కేసీఆర్ చెడు కోరుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎవరి చెడునూ కోరుకోదని స్పష్టం చేశారు.


కేసీఆర్ ఆరోగ్యం పట్ల వేరే ఆలోచన లేదని టీపీసీసీ చీఫ్ అన్నారు. కేసీఆర్ బాత్‌రూమ్‌లో జారీ పడితే గ్రీన్ ఛానల్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి వైద్యం చేయించిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆరోగ్యం గురించి అడిగిన సంగతి గుర్తులేదా అంటూ నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే కోరుకుంటున్నారని తెలిపారు. ప్రతిపక్ష నేతను కాంగ్రెస్ గౌరవిస్తుందని చెప్పారు.


55 మంది సిబ్బందితో కేసీఆర్ పాంహౌస్ దగ్గర ప్రభుత్వం సెక్యూరిటీ పెట్టిందని మహేశ్ వెల్లడించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. రేవంత్ రెడ్డి అభిమాని అని.. ఆ అభిమానంతోనే ఆయన అలా మాట్లాడి ఉండొచ్చన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తీరు దళిత సమాజాన్ని అవమానించే విధంగా ఉందని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి...

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తీరు సభ్య సమాజానికి అవమానకరం: భట్టి విక్రమార్క

సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేలతో ఇలా ప్రవర్తిస్తారా: బీఆర్ఎస్‌పై సీతక్క ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 09 , 2026 | 01:48 PM