Share News

సురక్షిత దక్షిణ భారతమే లక్ష్యంగా పోలీస్ వ్యవస్థలో సమన్వయం అవసరం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Oct 23 , 2026 | 07:35 PM

సరిహద్దులు దాటి విజృంభిస్తున్న నేరాలను అరికట్టడానికి దక్షిణాది రాష్ట్రాల పోలీస్ వ్యవస్థల మధ్య సమన్వయం అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన దక్షిణాది రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారుల సమావేశంలో ప్రసంగించారు.

సురక్షిత దక్షిణ భారతమే లక్ష్యంగా పోలీస్ వ్యవస్థలో సమన్వయం అవసరం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
cm revanth on sothern states police system

హైదరాబాద్, అక్టోబర్ 23: నేరాల స్వరూపం మారుతున్న నేపథ్యంలో పోలీస్ వ్యవస్థలో విస్తృత సంస్కరణలు చేపట్టి.. పటిష్ఠమైన కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. నేరస్థుల సమాచార మార్పిడికి వ్యవస్థీకృత నిర్మాణం అవసరమన్నారు. పోలీస్ వ్యవస్థపై చేసే వ్యయం సమాజ భద్రత, మెరుగైన భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడి అని ముఖ్యమంత్రి అన్నారు.


హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల పోలీస్ సమన్వయ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్‌ నికోబార్‌ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లకు చెందిన డీజీపీలు, ఐజీలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీఐ, రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎన్ఎస్‌జి, సీఐడీ సంస్థల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల పోలీస్ అధికారులు వారి ఉత్తమ పోలీసు విధానాలను వివరించారు.


ఇవి కూడా చదవండి..

దేశంలో కేసీఆర్ కీలకం కాబోయే రోజులు దగ్గరలో ఉన్నాయి: కేటీఆర్

వీసా వస్తుందో రాదోనని ఆందోళన.. అత్తాపూర్‌లో యువకుడి మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 23 , 2026 | 07:36 PM