Share News

వీసా వస్తుందో రాదోనని ఆందోళన.. అత్తాపూర్‌లో యువకుడి మృతి

ABN , Publish Date - Oct 23 , 2026 | 03:06 PM

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో యువకుడి ఆత్మహత్య కలకలం రేపుతోంది. తేజస్వినగర్‌లో 26 ఏళ్ల రోహిత్ రెడ్డి ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

వీసా వస్తుందో రాదోనని ఆందోళన.. అత్తాపూర్‌లో యువకుడి మృతి
Hyderabad News

రంగారెడ్డి, అక్టోబర్ 23: నగరంలోని అత్తాపూర్‌లో యువకుడి ఆత్మహత్య కలకలం రేపుతోంది. తేజస్వినగర్‌లో 26 ఏళ్ల రోహిత్ రెడ్డి ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉన్నతచదవుల కోసం అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్న రోహిత్ రెడ్డి.. ఇందుకోసం వీసాకు ప్రయత్నించాడు. అయితే గతంలో ఒకసారి వీసాకు దరఖాస్తు చేసుకోగా రిజెక్ట్ అయ్యింది. దీంతో రెండోసారి వీసా కోసం సదరు యువకుడు ఎదురుచూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. వీసా వస్తుందో రాదోనని తల్లిదండ్రులతో కూడా పలుమార్లు చర్చించినట్లు సమాచారం.


ఈ క్రమంలో యువకుడి ఆత్మహత్యకు వీసా ఆందోళనే కారణమై ఉండవచ్చని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే అత్తాపూర్ పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఎల్‌నినో ప్రభావంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి: సీఎస్ సంజయ్ జాజు

దేశంలో కేసీఆర్ కీలకం కాబోయే రోజులు దగ్గరలో ఉన్నాయి: కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 23 , 2026 | 03:18 PM