ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్
ABN , Publish Date - Nov 29 , 2026 | 05:57 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
డీలిమిటేషన్ బిల్లుపై ఏఐసీసీ భేటీలో పాల్గొననున్న సీఎం
రాష్ట్ర ఎంపీలు ఢిల్లీకి రావాలని ఆదేశాలు..
వారికి రేవంత్ దిశానిర్దేశం
హైదరాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. డీలిమిటేషన్ బిల్లు, ప్రత్యేక పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఏఐసీసీ నిర్వహించే సమావేశాలకు ఆయన హాజరుకానున్నారు. అలాగే డీలిమిటేషన్ అంశంపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించనున్నారని, ఆ ప్రెస్‌మీట్‌లో సీఎం రేవంత్ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇటు పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఎంపీలందరినీ ఢిల్లీకి రావాలని ఇప్పటికే పార్టీ ఆదేశించింది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు సహా పలు అంశాలపై పార్లమెంట్‌లో వ్యవహరించాల్సిన విధానంపై సీఎం రేవంత్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారని, ఒకటి, రెండు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉండనున్నారని సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం
పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం: డీజీపీ ఆనంద్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News