Share News

మదీనా బస్సు ప్రమాద బాధితులకు పరిహారం అందజేసిన సీఎం రేవంత్

ABN , Publish Date - Feb 28 , 2026 | 06:38 PM

మదీనా బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్‌గ్రేషియా అందజేశారు. మదీనా ప్రమాదం గురించి తెలియగానే సహాయ చర్యలపైన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడానని ప్రస్తావించారు.

మదీనా బస్సు ప్రమాద బాధితులకు పరిహారం అందజేసిన సీఎం రేవంత్
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో నవంబర్ 17, 2025న జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 44 మంది హైదరాబాద్ వాసులు సజీవ దహనమైన విషయం తెలిసిందే. మదీనా బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఎక్స్‌గ్రేషియా అందజేశారు. 44 మంది మృతుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున, గాయపడిన ఒకరికి రూ.3 లక్షల పరిహారం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.


మదీనా ప్రమాదం గురించి తెలియగానే సహాయ చర్యలపైన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడానని ప్రస్తావించారు. మంత్రి అజారుద్దీన్‌ను వెంటనే మదీనా పంపించానుని గుర్తుచేశారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దేశం బయట జరిగే ప్రమాదాలకు ప్రభుత్వాలు పరిహారం చెల్లించదని.. కానీ బాధితుల కుటుంబాల పరిస్థితి చూసి సహాయం ప్రకటించామని అన్నారు. నాంపల్లి అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను కూడా ఆదుకున్నామని పేర్కొన్నారు.


తమ ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకాన్ని ప్రజకు కలిగించామని చెప్పుకొచ్చారు. అందుకే కుటుంబాలను సెక్రటేరియట్‌కి పిలిచి పరిహారం అందించామని వివరించారు. ఇది ప్రజల ప్రభుత్వమని.. ఆందోళన చెందొద్దని అన్నారు. ప్రజల కష్టం, ఆనందంలో మీతో ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ నెల ముస్లింరులకు చాలా పవిత్రమైనదని..అంతా కలిసి మెలిసి ముందుకెళ్దామని పిలుపునిచ్చారు. కొడంగల్‌లో 2009 నుంచి ప్రతి సంవత్సరం ప్రతి మండలం నుంచి ఒకరి చొప్పున తాను హజ్‌కు పంపిస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నాంపల్లి కోర్టుకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఎందుకంటే..

విద్యా కమిషన్ సిఫారసులతో పేద విద్యార్థులు విద్యకు దూరం: బండి సంజయ్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 28 , 2026 | 06:40 PM