Share News

తెలంగాణలో మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి కీలక ముందడుగు

ABN , Publish Date - Jun 19 , 2026 | 03:49 PM

తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అమలుకు కేంద్రం నుంచి అధికారిక అనుమతి లభించింది.

తెలంగాణలో మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి కీలక ముందడుగు
Musi Riverfront Project

హైదరాబాద్, జూన్ 19: తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అమలుకు కేంద్రం నుంచి అధికారిక అనుమతి లభించింది. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాపూఘాట్‌ను ‘గాంధీ సరోవర్’గా అభివృద్ధి చేయడానికి వర్కింగ్ పర్మిషన్‌ను మంజూరు చేసింది. రూ.533.42 కోట్ల విలువైన 83.81 ఎకరాల డిఫెన్స్ భూమి వినియోగానికి అనుమతిచ్చింది. ఆర్టిలరీ సెంటర్ గోల్కొండ పరిధిలోని భూమిలో అభివృద్ధి పనులకు కేంద్రం క్లియరెన్స్‌ ఇచ్చింది.


రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు కృతజ్ఞతలు: సీఎం రేవంత్

మూసీ రిఫర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్‌కు కేంద్రం అనుమతి ఇవ్వడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు సీఎం కృతజ్ఞతలు తెలియజేశారు. మూసీ పునరుజ్జీవం, రివర్‌ ఫ్రంట్ అభివృద్ధి విజన్‌లో ఇదో మైలురాయన్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని పర్యావరణ, సాంస్కృతిక, ప్రజా ఆస్తిగా మార్చడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

వాన్‌‌పిక్‌ ఆస్తుల వ్యవహారం.. హైకోర్టులో ఈడీ పిటిషన్ డిస్మిస్

విద్యాసంస్థల్లో ర్యాంక్స్ ఇంపార్టెంట్ కాదు.. సేఫ్ ఎన్విరాన్మెంట్ ముఖ్యం: సీపీ సజ్జనార్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 19 , 2026 | 04:39 PM