బీఆర్‌ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్టు
ABN , Publish Date - Nov 12 , 2026 | 05:50 AM
సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు వివాదాస్పదం కావడంతో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీకి చెందిన బీఆర్‌ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ శ్యాంసుందర్‌రావును హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు
తిమ్మాపూర్, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు వివాదాస్పదం కావడంతో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీకి చెందిన బీఆర్‌ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ శ్యాంసుందర్‌రావును హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చేసిన ఆరోపణలను ఖండిస్తూ శ్యాంసుందర్‌రావు ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టాడు.
ఈ క్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సతీమణి హిందూజ గురించి కూడా పోస్ట్ పెట్టడం వివాదానికి దారితీసింది. దీనిపై ఆమె హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్యాంసుందర్‌రావుపై అట్రాసిటీ కేసుతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో ఆయన పది రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడు. తాజాగా బుధవారం ఆయన్ను అదుపులోకి తీసుకుని, హైదరాబాద్‌కు తరలించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ఈ వార్తలు కూడా చదవండి.
ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News