Share News

రణరంగం

ABN , Publish Date - Sep 08 , 2026 | 04:10 AM

శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా తొలిరోజే రణరంగాన్ని తలపించింది! ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు రాసి ఉన్న నల్ల దుస్తులు ధరించి, ప్లకార్డులు పట్టుకుని బీఆర్‌ఎస్‌ సభ్యులు అసెంబ్లీకి వచ్చారు! స్పీకర్‌ ఆదేశాల మేరకు లోపలికి అనుమతించేది లేదని, చొక్కాలు మార్చుకుని రావాలని పోలీసులు స్పష్టం చేశారు!

రణరంగం
KTR Harish Rao

  • స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ మధు అనుచిత వ్యాఖ్యలు

  • తొలిరోజే అసెంబ్లీ గేటు వద్ద తోపులాట.. ఉద్రిక్తత

  • నల్ల దుస్తులపై నినాదాలతో వచ్చిన బీఆర్‌ఎస్‌

  • సభ్యులను అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర వాగ్వాదం

  • టీ షర్టు విప్పేసి బనియన్‌తో హరీశ్‌రావు నిరసన

  • ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలతో

  • స్పీకర్‌ మనస్తాపం.. చర్చకు కాంగ్రెస్‌ సభ్యుల పట్టు

  • తాతా మధు బర్తర్‌ఫకు సీఎం రేవంత్‌ ప్రతిపాదన

  • సభలో మద్దతు తెలిపిన బీజేపీ, ఇతర పార్టీలు

  • బర్తర్‌ఫకు మండలి చైర్మన్‌ను కోరుతూ నేడు తీర్మానం

  • మండలి చైర్మన్‌కు కాపీ.. చర్య తీసుకునే చాన్స్‌

  • నేడు ఫాంహౌస్‌ ఎదుట చావుడప్పుకు వేముల పిలుపు

శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా తొలిరోజే రణరంగాన్ని తలపించింది! ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు రాసి ఉన్న నల్ల దుస్తులు ధరించి, ప్లకార్డులు పట్టుకుని బీఆర్‌ఎస్‌ సభ్యులు అసెంబ్లీకి వచ్చారు! స్పీకర్‌ ఆదేశాల మేరకు లోపలికి అనుమతించేది లేదని, చొక్కాలు మార్చుకుని రావాలని పోలీసులు స్పష్టం చేశారు! ఈ సందర్భంగా, అసెంబ్లీ గేటు బయట పోలీసులు, బీఆర్‌ఎస్‌ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలు, తోపులాటలు జరిగాయి! పలుమార్లు ఉద్రిక్తత చోటు చేసుకుంది! హరీశ్‌ రావు చొక్కా విప్పేసి సభలోకి వెళ్తానని పట్టుబట్టారు! పోలీసులపై పలువురు బీఆర్‌ఎస్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు పోలీసులపై మండిపడ్డారు! ‘‘మమ్మల్ని అడ్డుకోవాలని ఆ స్పీకర్‌ గాడు చెప్పాడా!? ఏ లం.. కొడుకు మీకు అధికారం ఇచ్చింది!?’’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు! ఇక, తన ముఖం, చేతులపై పోలీసులు రక్కేశారని కేటీఆర్‌ ఆరోపిస్తే.. తన చీర లాగేశారని సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు! తనను మెడపట్టి గెంటేశారని, జుట్టు పట్టుకుని లాగారని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు! మరోవైపు, తాతా మధు వ్యాఖ్యతో అసెంబ్లీకి ముందు స్పీకర్‌ మనస్తాపానికి గురయ్యారు! ఈ అంశంపై సభలో చర్చకు కాంగ్రెస్‌ సభ్యులు పట్టుబట్టారు! దళిత స్పీకర్‌ను అవమానించిన తాతా మధును ఎమ్మెల్సీ సభ్యత్వం నుంచి బర్తరఫ్‌ చేయాల్సిందేనని సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రతిపాదించారు! ఇందుకు బీజేపీ సహా మిగిలిన పార్టీలు మద్దతు పలికాయి! తాతా మధు తీరును బీజేపీ ఖండించింది! ఆయనను బర్తరఫ్‌ చేయాలని మండలి చైర్మన్‌ను కోరుతూ మంగళవారం శాసనసభ తీర్మానాన్ని ఆమోదించనుంది! దానిని మండలి చైర్మన్‌కు పంపనుంది! దాని ఆధారంగా ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది! కాగా, స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కేసీఆర్‌ ఫాంహౌజ్‌ ఎదుట దళిత సమాజం మంగళవారం చావు డప్పు కొడుతుందని ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం ప్రకటించారు!


ఈ వార్తలు కూడా చదవండి..
ఈ పౌడర్‌తో గంటలో శుభ్రమైన నీరు

రాష్ట్రంలో ‘సర్‌’ గడువు పొడిగింపు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 08 , 2026 | 04:11 AM