Share News

ఈ పౌడర్‌తో గంటలో శుభ్రమైన నీరు

ABN , Publish Date - Sep 08 , 2026 | 01:28 AM

నీళ్లలోని 95 శాతం మైక్రోస్కోపిక్‌ ప్లాస్టిక్‌, రసాయనాలను తొలగించే, పునర్వినియోగించుకోగలిగే వీలున్న ఒక అయస్కాంత పౌడర్‌ను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఆసక్తికరమైన ఈ పురోగతి గురించి తెలుసుకుందాం!

ఈ పౌడర్‌తో గంటలో శుభ్రమైన నీరు
purogati

నీళ్లలోని 95 శాతం మైక్రోస్కోపిక్‌ ప్లాస్టిక్‌, రసాయనాలను తొలగించే, పునర్వినియోగించుకోగలిగే వీలున్న ఒక అయస్కాంత పౌడర్‌ను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఆసక్తికరమైన ఈ పురోగతి గురించి తెలుసుకుందాం!

ఆస్ట్రేలియాలోని ఆర్‌ఎమ్‌ఐటి యూనివర్శిటీ శాస్త్రవేత్తలు, గంట వ్యవధిలో, నీళ్లలో కలిసిన మైక్రోప్లాస్టిక్ట్‌, నానోప్లాస్టిక్స్‌ను 95 శాతం మేరకు తొలగించే అయస్కాంత పౌడర్‌ను రూపొందించారు. కంటికి కనిపించే వీల్లేని 30 నానో మీటర్ల ప్లాస్టిక్‌ కలుషితాలు అదృశ్యరూపంలో మన తాగునీళ్లలో కలిసి ఉంటాయి. నీళ్లను వడగట్టే వాటర్‌ ఫిల్టర్లు వీటిని తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉండవు. కాబట్టి అయస్కాంత పౌడర్‌ను నీళ్లలో కలపడం ద్వారా, పాలీఎథిలీన్‌, పాలియస్టర్‌ మొదలైన ప్లాస్టిక్స్‌తో పాటు, విషపూరిత రసాయనాలను, భార లోహాలనూ, ఇబ్యుప్రోఫెన్‌ లాంటి ఔషథ అవశేషాలను కూడా తొలగించుకోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..
శరాఘాతం లాంటి సర్జికల్‌ మెనోపాజ్‌

పైబడే వయసుకు అడ్డుకట్ట

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 08 , 2026 | 01:29 AM