Share News

పైబడే వయసుకు అడ్డుకట్ట

ABN , Publish Date - Sep 08 , 2026 | 01:21 AM

కణాల్లోని మైటోకాండ్రియా మన వయసును పెంచగలుగుతుంది లేదా తగ్గించగలుగుతుందని తాజాగా ఒక పరిశోధనలో తేలింది. మరిన్ని వివరాలు....

పైబడే వయసుకు అడ్డుకట్ట
parishodhana

కణాల్లోని మైటోకాండ్రియా మన వయసును పెంచగలుగుతుంది లేదా తగ్గించగలుగుతుందని తాజాగా ఒక పరిశోధనలో తేలింది. మరిన్ని వివరాలు....

మైటోకాండ్రియాలను, మన కణాల శక్తి భాండాగారాలుగా పిలుస్తారు. అయితే వయసు పైబడేకొద్దీ మైటోకాండ్రియాల క్షీణించిపోయే పరిస్థితి ఇప్పటివరకూ ఒక జీవసంబంధ చిక్కుముడిగానే మిగిలిపోయింది. నేచర్‌ కమ్యూనికేషన్స్‌లో తాజాగా ప్రచురితమైన ఒక అధ్యయనం, ఈ క్షీణత వెనకుండే కీలక ప్రక్రియను వివరించింది. జర్మనీకి చెందిన లిబ్నీజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏజింగ్‌ పరిశోధకులు, ఫాస్ఫాటిడైల్కోలీన్‌ అనే మెంబ్రేన్‌ లిపిడ్‌ తగ్గడం వల్ల మైటోకాండ్రియా సామర్థ్యం తగ్గుతున్నట్టు కనుగొన్నారు. ఈ ముఖ్యమైన లిపిడ్‌ లోపం వల్ల మైటోకాండ్రియా నమ్యత పరిమితమైపోతుంది. ఈ కీలక లిపిడ్‌ లోపిస్తే, కణాల్లో శక్తిని ఉత్పత్తి చేసే కేంద్రాల మధ్య సమన్వయం లోపించి, కణాలకు శక్తి సమకూరక, పైబడే వయసుతో తలెత్తే శారీరక క్షీణత వేగవంతమవుతుంది. అయితే ఈ ప్రక్రియను మార్చడం సాధ్యపడుతుందని పరిశోధకులు భరోసా కల్పిస్తున్నారు. ఒత్తిడికి గురైన మానవ కణాలకు ఫాస్ఫాటిడైల్కోలీన్‌ లేదా దాని మూలపదార్థమైన కోలీన్‌ను అందించినప్పుడు, మైటోకాండ్రియా నిర్మాణం, పనితీరు తిరిగి యవ్వన స్థితికి చేరుకుంటున్నట్టు పరిశోధకులు గమనించారు. అలాగని ఒక రోజువారీ మాత్రతో అప్పటికప్పుడే యవ్వనంగా మారిపోయే వీలు లేకపోయినప్పటికీ, ఈ సూక్ష్మ శక్తి భాండాగారాలను కాపాడుకుని, సరిదిద్దుకోవడం ద్వారా పైబడే వయసు వేగాన్ని తగ్గించుకునే వీలు లేకపోలేదని పరిశోధకులు అంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..
శరాఘాతం లాంటి సర్జికల్‌ మెనోపాజ్‌

ప్యాంటీ లైనర్స్‌తో ప్రమాదం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 08 , 2026 | 01:21 AM