Share News

పైసలిస్తేనే పర్మిషన్లు..!

ABN , Publish Date - Aug 21 , 2026 | 10:22 AM

ట్రై కార్పొరేషన్లలోని కొందరు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

 పైసలిస్తేనే పర్మిషన్లు..!

  • అధికారుల అక్రమ వసూళ్లు..

  • ట్రై కార్పొరేషన్లలోని ప్లానింగ్‌ విభాగం లీలలు

హైదరాబాద్‌ సిటీ: ట్రై కార్పొరేషన్లలోని కొందరు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతుల నుంచి ఓసీల జారీ వరకు.. ఫైల్‌కు ఇంత అని, అంతస్తులు, నిర్మాణ విస్తీర్ణం బట్టి రేట్లు నిర్ణయించి మరీ లంచాలు తీసుకుంటున్నారు. అడిగినంత ఇవ్వకుంటే నోటీసులు, కూల్చివేతలంటూ వేధింపులకు గురి చేస్తున్నారు. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(సీఎంసీ) పరిధిలో ఈ తతంగం ఎక్కువగా జరుగుతుండగా.. తామేమి తక్కువ కాదన్నట్టు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎంఎంసీ) యంత్రాంగం కూడా వారితో పోటీ పడుతోంది.


city4.jpgఅంతా మేం చూసుకుంటాం..

అక్రమ నిర్మాణాల విషయంలో అధికారుల దోపిడికి అడ్డూ అదుపు ఉండడం లేదు. మాదాపూర్‌లో నోటరీ స్థలాల్లో నాలుగైదు అంతస్తుల భవన నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ప్రాంతాల వారీగా అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి బాధ్యతలు అప్పగించి.. నిర్మాణదారుల నుంచి కొందరు అధికారులు వసూళ్లు చేస్తుండడం గమనార్హం. కూకట్‌పల్లి జోన్‌ పరిధిలోనూ పలువురు పట్టణ ప్రణాళికా విభాగం అధికారుల తీరు చర్చనీయాంశంగా మారింది. అంతా మేం చూసుకుంటాం.. అదనపు అంతస్తులు నిర్మించుకోండని భవన యజమానులకు భరోసా ఇస్తున్నట్టు తెలిసింది.


గ్రౌండ్‌ ప్లస్‌ రెండంతస్తుల భవనానికి అనుమతి తీసుకున్న ఓ వ్యక్తి అదనంగా మరో రెండంతస్తులు నిర్మించారు. స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోగా.. త్వరగా బయటి వైపు పనులు పూర్తి చేసి రంగులు వేయాలని సూచించినట్టు సమాచారం. చైన్‌మెన్‌ నుంచి టీపీఎస్‌, ఏసీపీ, సిటీ ప్లానర్ల వరకు అవినీతిలో భాగస్వాములుగా ఉంటున్నారు. ప్రతీ ఫైల్‌కు ముడుపులు ముట్టాల్సిందే అని కింది స్థాయి సిబ్బంది వద్ద పైఅధికారులు బహిరంగంగా చెబుతుండడం గమనార్హం.


ఈ వార్తలు కూడా చదవండి:

ఈసారి రోబో గణేశా!

క్యాన్సర్‌ కేర్‌, ఆరోగ్యశ్రీ భేష్‌!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 21 , 2026 | 10:22 AM