Share News

బీమా పాలసీ తీసుకుంటున్నారా? ఈ 5 ముఖ్యమైన అంశాలు గమనించండి!

ABN , Publish Date - Aug 21 , 2026 | 09:52 AM

నేటికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మహాకష్టంగా మారింది. అలానే అకస్మాత్తుగా జరిగే వివిధ రకాల ప్రమాదాలతో జీవితాలు చీకటిమయంగా మారుతున్నాయి. ఈ క్రమంలో చాలామంది వివిధ రకాల బీమా పాలసీలు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.

బీమా పాలసీ తీసుకుంటున్నారా?  ఈ 5 ముఖ్యమైన అంశాలు గమనించండి!
insurance policy

స్పోర్ట్స్ డెస్క్: ప్రస్తుతం కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మహాకష్టంగా మారింది. చాలా మంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాఅనారోగ్యాల బారినపడుతున్నాము. అలానే అకస్మాత్తుగా జరిగే వివిధ రకాల ప్రమాదాలతో అనేక మంది జీవితాలు చీకటిమయంగా మారుతున్నాయి. ఇంకా చెప్పాలంటే.. అనుకోని విపత్తులు వచ్చిన ఒళ్లు ఇల్లు గుల్లవుతాయి. వచ్చే ప్రమాదాలను, సమస్యలను మనం తప్పించుకోలేకపోయినా.. వాటి నుంచి కాస్త అయిన ఉపశమనం పొందేందుకు బీమా పాలసీ తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం తక్కువ ప్రీమియం చూసి మోసపోకుండా, సరైన పాలసీని ఎంచుకోవడానికి నిపుణులు కొన్ని కీలక సూచనలు చేశారు. అవేమిటో ఇక్కడ పరిశీలిద్దాం.


1. ప్రీమియం ఒక్కటే చూడకండి - కవరేజ్ ముఖ్యం:

అత్యంత చౌకైన పాలసీ ఎప్పుడూ ఉత్తమమైనది కాకపోవచ్చు. ముందుగా మీ కుటుంబ అవసరాలకు తగినంత కవరేజ్ లభిస్తుందా లేదా అని బేరీజు వేసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీ ఆదాయం, అప్పులు, ఇతర ఖర్చులను బట్టి సరైన ప్రీమియంను ఎంచుకోవాలి. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్‌లో మనం తీసుకునే ప్రీమియం అయితే పెద్ద ఆసుపత్రిలో కూడా చికిత్స చేసుకునే సదుపాయం ఇస్తుందా అని ప్రశ్నించుకోవాలి.

2. మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్ గమనించాలి:

చాలా మంది పాలసీ ఏం కవర్ చేస్తుందో చూస్తారు కానీ, ఏది కవర్ చేయదనే అంశాన్ని (Exclusions) పరిశీలించరు. ఆరోగ్య బీమాలో ముందే ఉన్న రోగాల వెయిటింగ్ పీరియడ్, గది అద్దె పరిమితులు వంటి నిబంధనలు మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే సమయంలో నేరుగా ప్రభావం చూపుతాయి. కాబట్టి పాలసీ తీసుకునే ముందే ఈ నిబంధనలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి.


3. ఆకర్షణీయమైన ఫీచర్ల కంటే సర్వీస్ ముఖ్యం:

కేవలం ఆకర్షణీయమైన ప్రకటనలు లేదా తక్కువ ప్రీమియం చూసి నిర్ణయం తీసుకోకండి. పాలసీ పునరుద్ధరణ నిబంధనలు, బీమ సంస్థ సెటిల్మెంట్ రికార్డు ఎలా ఉందో చూసుకోవాలి. క్లెయిమ్స్ లేదా సర్వీస్‌కు సంబంధించి ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో నమ్మకమైన సంస్థను ఎంచుకోవడం ఉత్తమం.

4. బీమాను, పెట్టుబడిని కలపకండి:

బీమా అనేది కేవలం ఆర్థిక రక్షణ కోసం మాత్రమే. పెట్టుబడులు సంపదను సృష్టిస్తాయి. కాబట్టి మీ కుటుంబానికి రక్షణ కావాలంటే తగిన టర్మ్ లేదా హెల్త్ పాలసీ తీసుకోవాలి. రిటైర్మెంట్ లేదా ఇతర ఆర్థిక లక్ష్యాల కోసం అయితే మ్యూచువల్ ఫండ్స్, సిప్ (SIP) వంటి ఇతర పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాలి.

5. పాలసీ తీసుకుని మర్చిపోవద్దు:

సమయంతో పాటు మన బాధ్యతలు మారుతుంటాయి. పెళ్లి, పిల్లలు, గృహ రుణాలు, లేదా వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యతలు పెరిగినప్పుడు మన బీమా అవసరాలు కూడా మారుతాయి. కాబట్టి మీ ఆర్థిక పరిస్థితులు మారిన ప్రతిసారీ మీ ఇన్సూరెన్స్ కవరేజ్‌ను సమీక్షించుకోవడం చాలా ముఖ్యమని ఇన్సూరెన్స్ నిపుణులు సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

ఫిఫా మహిళల ప్రపంచ కప్ 2027 షెడ్యూల్ విడుదల..

క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డును సమం చేసిన జో రూట్..

Updated Date - Aug 21 , 2026 | 09:56 AM