క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డును సమం చేసిన జో రూట్..
ABN , Publish Date - Aug 21 , 2026 | 07:34 AM
ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు. పాకిస్థాన్‌తో హెడ్డింగ్లే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో అతడు అర్ధ సెంచరీ చేయడంతో సచిన్ రికార్డును సమం చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ మరో అరుదైన ఘనత సాధించాడు. హెడ్డింగ్లే వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో రూట్ అర్ధ సెంచరీ చేసి.. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పటి వరకు సచిన్ ఒక్కటే ఉన్న అగ్రస్థానంలో రూట్ వచ్చి చేరాడు. మరి.. రూట్ సాధించిన ఈ అరుదైన రికార్డుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...
పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట జో రూట్ 112 బంతుల్లో 10 బౌండరీల సహాయంతో 66 పరుగులు సాధించి ఔటయ్యాడు. ఇది అతడి కెరీర్‌లో 68వ టెస్ట్ హాఫ్ సెంచరీ. ఈ అర్ధ శతకంతో రూట్, సచిన్ టెండూల్కర్‌తో కలిసి టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక 50-ప్లస్ స్కోర్ల జాబితాలో సంయుక్త అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు సచిన్ ఒక్కరే 68 హాఫ్ సెంచరీలతో టాప్ ప్లేసులో ఉన్నాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం శివ్‌నారాయణ్ చందర్‌పాల్ (66 అర్ధ శతకాలు) మూడో స్థానంలో ఉండగా, మాజీ ఆస్ట్రేలియా కెప్టెన్ అలెన్ బోర్డర్, భారత్ రాహుల్ ద్రావిడ్ చెరో 63 అర్ధశతకాలతో సంయుక్తంగా నాలుగో స్థానాల్లో కొనసాగుతున్నారు.
అలాగే, కెప్టెన్‌గా టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక 50-ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో జో రూట్ (42) ఐదవ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (61) అగ్రస్థానంలో ఉన్నాడు. అలానే ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (54), అలెన్ బోర్డర్ (51), పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ (43) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
నేర్చుకునేందుకు సీనియారిటీ అడ్డు కాదు: కేఎల్ రాహుల్
శ్రీలంకపై ఘన విజయం.. డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ స్థానం ఇదే!