Share News

22ఏ పేరిట కాంగ్రెస్‌ సర్కార్‌ భూదోపిడీ: లక్ష్మణ్‌

ABN , Publish Date - Aug 21 , 2026 | 07:04 AM

తెలంగాణలో 22ఏ నిషేదిత భూముల జాబితా పేరిట కాంగ్రెస్‌ ప్రభుత్వం భూదోపిడీకి పాల్పడుతోందని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొనసాగేది ప్రజా పాలన కాదని...

22ఏ పేరిట కాంగ్రెస్‌ సర్కార్‌ భూదోపిడీ: లక్ష్మణ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 22ఏ నిషేదిత భూముల జాబితా పేరిట కాంగ్రెస్‌ ప్రభుత్వం భూదోపిడీకి పాల్పడుతోందని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొనసాగేది ప్రజా పాలన కాదని.. దోపిడీ పాలన అని విమర్శించారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ వచ్చాక 22ఏ జాబితా నుంచి ఎన్ని వేల ఎకరాలు తొలగించారు? అందులో బడా కంపెనీలు, మంత్రుల బినామీలు ఎవరున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 22ఏ పేరుతో జరిగిన అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర విచారణ జరిపించే దమ్ముందా? అని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షమాపణలు చెప్పారంటేనే... స్కాం జరిగిందని ప్రభుత్వం ఒప్పుకొన్నట్లేనని చెప్పారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల విలువైన స్థలం కనిపిస్తే చాలు.. రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో పెట్టేసి, 30-40ు కమీషన్లు డిమాండ్‌ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాగా, బహిరంగ ప్రదేశాల్లో పాలిచ్చే తల్లులు, శిశువుల సంరక్షణ కోసం గౌరవప్రదమైన, సురక్షితమైన, గోప్యతతో కూడిన మౌలిక సదుపాయాలను కల్పించాలని జాతీయ మహిళా కమిషన్‌కు బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం మహిళా కమిషన్‌ చైర్మన్‌ విజయ కిశోర్‌ రహాత్కర్‌కు సామాజిక కార్యకర్త నేహాతో కలిసి ఆయన వినతిపత్రం అందించారు. తల్లి, శిశు సంరక్షణ మౌలిక సదుపాయాల కల్పన, వారి హక్కులను పరిరక్షించడం కోసం చట్టాన్ని రూపొందించేందుకు కేంద్రానికి సిఫార్సు చేయాలని విన్నవించారు.

ఇవి కూడా చదవండి:

పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్

బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Aug 21 , 2026 | 07:04 AM