నేర్చుకునేందుకు సీనియారిటీ అడ్డు కాదు: కేఎల్ రాహుల్
ABN , Publish Date - Aug 20 , 2026 | 10:44 AM
టీమిండియా డ్రెసింగ్ రూమ్ వాతావరణంపై తాజాగా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా డ్రెస్ రూమ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని, ఇక్కడ నేర్చుకునే విషయంలో ఆటగాళ్లకు సిగ్గు, అహంభావం వంటివి లేవని తెలిపాడు.
స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 10 వికెట్లు సాధించిన యువ స్పిన్నర్ మానవ్ సుతర్ టీమిండియా విజయంలో కీలక పాత్ర షోపించాడు. అతడి పాటు బ్యాటింగ్ విభాగంలో దేవదత్ పటిక్కల్, కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించి.. భారత్ విజయంలో తమవంతు పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం టీమిండియా డ్రెసింగ్ రూమ్ పరిస్థితులపై తాజాగా రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా డ్రెస్ రూమ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని, ఇక్కడ నేర్చుకోవడంలో సిగ్గు, అహంభావం వంటివి లేవని తెలిపాడు.
మీడియాతో రాహుల్ మాట్లాడుతూ...'దేవదత్ పడిక్కల్, మానవ్ సుతార్ వంటి యువ ఆటగాళ్లు తక్కువ సమయంలో అద్భుత ప్రదర్శన చేసి.. మంచి గుర్తింపు సంపాదించడం చూసి ఒక సీనియర్ ఆటగాడిగా నేను ఎంతో సంతోషించాను. భారత డ్రెస్సింగ్ రూమ్ ఒక స్వేచ్ఛా యుతమైన వాతావరణంగా ఉంటుంది. ఇక్కడ ఆటగాళ్లు స్వేచ్ఛగా మాట్లాడటానికి, వారి అభిప్రాయాలను వ్యక్తపర్చడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని మ్యాచులు ఆడినమనే దానితో సంబంధం లేకుండా తోటి ఆటగాళ్లకు సహాయం చేయడం ప్రతి ప్లేయర్ బాధ్యత అని నేను భావిస్తున్నాను' అని రాహుల్ అన్నాడు.
'కొన్ని సందర్భాల్లో మా జట్టులో సీనియర్ ప్లేయర్లు, తక్కువ మ్యాచులు ఆడిన జూనియర్ ఆటగాళ్లు ఉంటారు. ఆ సమయంలో 'నేను నీ దగ్గర ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు' అని సీనియర్ ఆటగాళ్లు , 'అతను చాలా టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు కాబట్టి నేను వెళ్లి అతనితో మాట్లాడలేను' అని యువ ఆటగాళ్లు ఏదైనా చెప్పేందుకు సంకోచించరు. మా ఆటగాళ్ల మధ్య ఎటువంటి సిగ్గు లేదా అహంభావం ఉండేవి కావు. అందుకే మా డ్రెస్సింగ్ రూమ్ ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ఉండేది. ఆటగాళ్లు పరస్పరం నేర్చుకుంటూ ఉంటారు' అని తెలిపాడు. ఆటగాళ్లు నేర్చుకునే ప్రక్రియను కొనసాగించడానికి సీనియారిటీ అడ్డంకి కాదని రాహుల్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
శ్రీలంకపై ఘన విజయం.. డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ స్థానం ఇదే!