పాక్ పని పట్టారు
ABN , Publish Date - Aug 20 , 2026 | 06:03 AM
హాకీ ప్రపంచ కప్‌లో భారత పురుషుల జట్టు రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది. గ్రూప్ ‘డి’లో భాగంగా బుధవారం జరిగిన తమ చివరి మ్యాచ్‌లో 5-3తో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్...
5-3తో భారత్ ఘన విజయం
రెండో రౌండ్‌కు హర్మన్ సేన వేదిక ఎక్కడైనా, పోటీ ఏదైనా పాకిస్థాన్ జట్టుపై భారత్‌దే ఆధిపత్యం..ఇది తాజా హాకీ ప్రపంచ కప్‌లోనూ నిరూపితమైంది.. తర్వాతి రౌండ్ చేరాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన పోరులో చిరకాల ప్రత్యర్థిని భారత్ చిత్తుచేసింది.
ఆమ్‌స్టెల్‌వీన్: హాకీ ప్రపంచ కప్‌లో భారత పురుషుల జట్టు రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది. గ్రూప్ ‘డి’లో భాగంగా బుధవారం జరిగిన తమ చివరి మ్యాచ్‌లో 5-3తో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (5వ, 21వ) పెనాల్టీ కార్నర్లతో, అభిషేక్ (11వ, 24వ) ఫీల్డ్ గోల్స్‌తో డబుల్ ధమాకా మోగించారు. వైస్-కెప్టెన్ హార్దిక్ సింగ్ (34వ) పెనాల్టీ స్ట్రోక్‌తో మరో గోల్ అందించాడు. పాక్ ఆటగాళ్లలో షాహిద్ (22వ, 46వ.), సుఫ్‌యాన్ (24వ) గోల్స్ చేశారు. రెండో స్థానంలో నిలిచిన భారత్ (6), గ్రూప్‌టాపర్ ఇంగ్లండ్ (9 పాయింట్లు)తో కలిసి రెండో రౌండ్ చేరింది. ఈ ఓటమితో పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 16ఏళ్ల తర్వాత వరల్డ్‌కప్‌లో పాక్‌తో తలపడిన భారత్.. మ్యాచ్‌లో ఆది నుంచే దూకుడు ప్రదర్శించింది. తొలి క్వార్టర్స్‌లోనే చెరో గోల్‌తో చెలరేగిన హర్మన్, అభిషేక్.. రెండో క్వార్టర్‌లోనూ గోల్స్ కొల్లగొట్టి భారత్‌ను తిరుగులేని స్థితిలో నిలిపారు. వెంటనే కోలుకొని రెండు గోల్స్ కొట్టిన పాక్‌ను దెబ్బకొడుతూ తర్వాతి క్వార్టర్‌లో హార్దిక్ గోల్‌తో విరుచుకుపడ్డాడు. దీంతో భారత్ ఆధిక్యం 5-2కి చేరింది. ఆఖర్లో గోల్‌తో పాక్ పోటీలోకి వచ్చినట్టు కనిపించినా, భారత్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది.
5
ప్రపంచ కప్‌లలో ఏడుసార్లు పాకిస్థాన్‌తో తలపడితే భారత్ సాధించిన విజయాలు
ఇవి కూడా చదవండి:
తండ్రైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్
కోహ్లీ సలహాలు నా జీవితాన్నే మార్చేశాయి: ఇంగ్లండ్ క్రికెటర్