Share News

మెడికల్ కాలేజీ ఆస్పత్రి ఆవరణలో మృతదేహం కలకలం

ABN , Publish Date - Aug 20 , 2026 | 10:38 AM

రేణిగుంటలో గుర్తుతెలియన మృతదేహం కలకలం రేపింది. బాలాజీ మెడికల్ కాలేజీ ఆస్పత్రి ఆవరణలో ఈ మృతదేహం వెలుగులోకి వచ్చింది. ఇంకుడు గుంత కోసం జేసీబీ సాయంతో తవ్వుతుండగా మట్టిలో డెడ్ బాడీ బయటపడింది.

మెడికల్ కాలేజీ ఆస్పత్రి ఆవరణలో మృతదేహం కలకలం
Tirupati news

తిరుపతి, ఆగస్టు 20: రేణిగుంటలో బాలాజీ మెడికల్ కాలేజీ ఆస్పత్రి ఆవరణలో మృతదేహం తీవ్ర కలకలం రేపింది. ఇంకుడు గుంత కోసం జేసీబీ సాయంతో తవ్వుతుండగా మట్టిలో గుర్తుతెలియని మృతదేహం బయటపడింది. వెంటనే ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతుడు పురుషుడిగా గుర్తించారు. ఆ బాడీ పూర్తిగా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం.


సుమారు నెల రోజుల క్రితం మృతదేహాన్ని పూడ్చి ఉండొచ్చని పోలీసుల అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన రేణిగుంట రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. అలానే ఆస్పత్రి ఆవరణలో మృతదేహం ఎలా వచ్చింది, ఎవరు పూడ్చినారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మృతుడి మరణానికి కారణమేంటన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇటీవల ఎవరైనా అదృశ్యమయ్యారా?, స్థానిక పోలీస్ స్టేషన్లలో నమోదైన అదృశ్య కేసుల వివరాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. బాలాజీ ఆస్పత్రి పరిసరాల్లో సీసీటీవీ, ఇతర ఆధారాలను సేకరించి పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికల తర్వాతే మృతదేహంపై పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని సమాచారం. మొత్తంగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.


ఈ వార్తలు కూడా చదవండి

చివరి రోజుకు చేరిన అసెంబ్లీ, మండలి వర్షాకాల సమావేశాలు.. చర్చించే అంశాలివే..

శ్రీశైలానికి మళ్లీ వరద

Updated Date - Aug 20 , 2026 | 11:59 AM