శ్రీశైలానికి మళ్లీ వరద
ABN , Publish Date - Aug 20 , 2026 | 04:53 AM
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ మొదలైంది. బుధవారం జూరాల ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల ద్వారా 24,912 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 40,978 క్యూసెక్కులు కలిపి..
జలాశయంలోకి 30,512 క్యూసెక్కులు
శ్రీశైలం, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ మొదలైంది. బుధవారం జూరాల ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల ద్వారా 24,912 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 40,978 క్యూసెక్కులు కలిపి మొత్త 65,890 క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా విడుదలైంది. సాయంత్రానికి 30,512 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875.50 అడుగులు ఉంది. పుర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 165.92 టీఎంసీలు ఉంది. కుడి ఎడమ జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగిస్తూ 55,768క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు.