Share News

తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం.. ఏపీ హైకోర్టుకు పోలీసుల నివేదిక..

ABN , Publish Date - Aug 20 , 2026 | 09:13 AM

కాకినాడ జిల్లా తుని చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించారు. ఇప్పటివరకు జరిగిన కేసు దర్యాప్తు వివరాలను ఆ నివేదిక ద్వారా కోర్టుకు తెలియజేశారు.

తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం.. ఏపీ హైకోర్టుకు పోలీసుల నివేదిక..
Sunkara Gnaneshwari Case

కాకినాడ: తుని చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించారు. ఇప్పటివరకు జరిగిన కేసు దర్యాప్తు వివరాలను ఆ నివేదిక ద్వారా కోర్టుకు తెలియజేశారు. జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి నేటికి 70 రోజులు గడిచాయి. ఇన్ని రోజులైనా చిన్నారి ఆచూకీ మాత్రం లభించలేదు.


చిన్నారి ఆచూకీని కనిపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారంటూ హైకోర్టులో న్యాయవాది జి.శ్రీకాంత్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జ్ఞానేశ్వరి కేసు విషయంలో పోలీసుల తీరును కోర్టు దృష్టికి శ్రీకాంత్ తీసుకువచ్చారు. నెలలు గడిచినా చిన్నారి ఆచూకీ కనిపెట్టలేదని పేర్కొన్నారు. మరోవైపు, పోలీసుల తరఫున న్యాయవాది జయంతి వాదనలు వినిపించారు. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ధర్మాసనానికి తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. జ్ఞానేశ్వరి అదృశ్యానికి సంబంధించి 15 రోజులకు ఒకసారి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. దీంతో కేసు దర్యాప్తు నివేదికను సమర్పించారు.


కాగా, జ్ఞానేశ్వరి అదృశ్యంతో బాధిత కుటుంబం తీవ్రంగా కుంగిపోయింది. నిత్యం తమ కుమార్తె ఫొటోలు, వీడియోలను చూసుకుంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి తండ్రి గణేశ్ ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టారు. అందులో తన కుమార్తెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆయన షేర్ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

చివరి రోజుకు చేరిన అసెంబ్లీ, మండలి వర్షాకాల సమావేశాలు.. చర్చించే అంశాలివే..

శ్రీశైలానికి మళ్లీ వరద

Updated Date - Aug 20 , 2026 | 09:35 AM