కష్టాలు తొలగిపోతాయని.. మళ్లీ పెళ్లి!
ABN , Publish Date - Aug 20 , 2026 | 04:55 AM
ఆ దంపతులు కొన్నేళ్ల కిందట ఒక్కటయ్యారు. అయితే పెళ్లి తర్వాత ఆ కుటుంబాలను ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు వెంటాడుతున్నాయి.
అన్నవరంలో పునర్వివాహం చేసుకున్న తొమ్మిది జంటలు
అన్నవరం, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ఆ దంపతులు కొన్నేళ్ల కిందట ఒక్కటయ్యారు. అయితే పెళ్లి తర్వాత ఆ కుటుంబాలను ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో ఒక ఆస్థాన సిద్ధాంతి సూచన మేరకు సత్యదేవుడి సన్నిధిలో బుధవారం మళ్లీ పెళ్లి చేసుకున్నారు. కాకినాడ జిల్లా అన్నవరం ఆలయ ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విశాఖ జిల్లా ఆనందపురానికి చెందిన మూడు జంటలు, అచ్యుతాపురానికి చెందిన ఆరు జంటలు బుధవారం ఆలయ ప్రాంగణానికి చేరుకోగా, పురోహితులు తొమ్మిది జంటలకు మళ్లీ వివాహం జరిపించారు. కష్టాలన్నీ గట్టెక్కేందుకు సత్యదేవుడి సన్నిధిలో పునర్వివాహం చేసుకున్నామని వారు చెప్పారు.