Share News

క్వార్టర్స్‌లో సాత్విక్‌, గాయత్రి జోడీలు

ABN , Publish Date - Aug 21 , 2026 | 05:28 AM

బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో భారత డబుల్స్‌ టాప్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి, అన్‌సీడెడ్‌ ద్వయం ట్రీసా జాలీ-గాయత్రీ గోపీచంద్‌ అద్భుత విజయాలతో క్వార్టర్స్‌కు...

క్వార్టర్స్‌లో సాత్విక్‌, గాయత్రి జోడీలు

సింధు, ఆయుష్‌ అవుట్‌

బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్స

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో భారత డబుల్స్‌ టాప్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి, అన్‌సీడెడ్‌ ద్వయం ట్రీసా జాలీ-గాయత్రీ గోపీచంద్‌ అద్భుత విజయాలతో క్వార్టర్స్‌కు చేరి పతకానికి అడుగు దూరంలో నిలిచారు. అయితే, ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు, ఆయుష్‌ షెట్టి రౌండ్‌-16లోనే ఓడడంతో.. సింగిల్స్‌లో భారత్‌ కథ ముగిసింది. గురువారం హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో పోరులో సాత్విక్‌-చిరాగ్‌ జంట 21-23, 21-19, 21-17తో మలేసియా ద్వయం జునైద్‌ ఆరి్‌ఫ-యప్‌ రాయ్‌ కింగ్‌పై గెలిచారు. మహిళల డబుల్స్‌లో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ట్రీసా-గాయత్రి ద్వయం 21-16, 21-12తో జపాన్‌కు చెందిన ఏడో సీడ్‌ రిన్‌ ఇవనాగ-కై నకనిషిపై నెగ్గింది. కాగా, సింగిల్స్‌లో 9వ సీడ్‌ సింధు 11-21, 21-15, 17-21తో మూడో సీడ్‌ వాంగ్‌ జి యి (చైనా) చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్‌లో ఓడినా.. రెండో గేమ్‌ గెలిచిన సింధు సమం చేసింది. అయితే, నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు 16-15తో పైచేయిగా నిలిచిన సమయంలో.. కిందపడిన వాంగ్‌ కండరాల నొప్పి అని మెడికల్‌ టైమౌట్‌ తీసుకొంది. అయితే, తిరిగి వచ్చిన తర్వాత దూకుడుగా ఆడుతూ వాంగ్‌ 18-17తో అనూహ్యంగా ఆధిక్యం అందుకుంది. అనంతరం 54 షాట్ల ర్యాలీలో పైచేయి సాధించిన వాంగ్‌.. మ్యాచ్‌ను సొంతం చేసుకొంది. కానీ, వాంగ్‌ నొప్పి అంటూ ఎత్తులు వేసిందని మ్యాచ్‌ ముగిసిన తర్వాత సింధు అభిప్రాయపడింది. ప్రత్యర్థి ఎన్ని నాటకాలు ఆడినా.. తాను ఓర్పుతో మ్యాచ్‌పైనే దృష్టిపెట్టి ఉండాల్సిందని నిరాశగా చెప్పింది. కాగా, తొలి రౌండ్‌లో వరల్డ్‌ నెం:1 షి యు కిని ఓడించి ప్రకంపనలు సృష్టించిన ఆయుష్‌.. మరోసారి చిరకాల ప్రత్యర్థి అల్వి ఫర్మాన్‌ (ఇండోనేసియా) చేతిలో 19-21, 11-21తో ఓటమి చవిచూశాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల-తనీషా క్రాస్టో జంట 16-21, 5-21తో చైనాకు చెందిన జిన్‌ వా గు-ఫాంగ్‌ హుయ్‌ చెన్‌ చేతిలో చిత్తయింది.

ఇవి కూడా చదవండి:

పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్

బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Aug 21 , 2026 | 05:28 AM