‘మీ పదవి మరికొన్ని నెలలు మాత్రమే’.. సీఎం రేవంత్‌పై బీజేపీ నేత ఘాటు వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 01 , 2026 | 04:00 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను రేవంత్ ఎగతాళి చేయడంపై ఆ పార్టీ జాతీయ ప్రతినిధి ప్రేమ్ శుక్లా మండిపడ్డారు.
న్యూఢిల్లీ, జులై 1: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను రేవంత్ ఎగతాళి చేయడంపై ఆ పార్టీ జాతీయ ప్రతినిధి ప్రేమ్ శుక్లా మండిపడ్డారు. ‘మీ రోజులు దగ్గరపడ్డాయి’ అంటూ హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్‌తో తెలంగాణను పోల్చడంపై తెలంగాణ సీఎంకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతల అహంకారం, చంచల రాజకీయం త్వరలోనే కుప్పకూలుతుందని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాజయం తప్పదని వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి అహంకారానికి త్వరలోనే తెరపడనుందన్నారు.
గతంలో బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే ఇప్పుడు కాంగ్రెస్‌కు పడుతుందని ప్రేమ్ శుక్లా హెచ్చరించారు. ‘రేవంత్ రెడ్డి.. కళ్లు తెరిచి చూడండి.. 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ. 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం. రేవంత్ రెడ్డి పదవి మరికొన్ని నెలలు మాత్రమే.. మీ రోజులు దగ్గరపడ్డాయి’ అంటూ బీజేపీ నేత ప్రేమ్ శుక్లా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
బీదర్ చెత్త వివాదం.. నిలిచిన రాకపోకలు
బైక్ దొంగతనాల ముఠా అరెస్ట్.. 5 ద్విచక్ర వాహనాల స్వాధీనం
Read Latest Telangana News And Telugu News