విద్యా శాఖ మంత్రిగా లోకేశ్ పనితీరుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు
ABN , Publish Date - Jul 01 , 2026 | 03:36 PM
ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. విద్యా శాఖ మంత్రిగా దేశానికే ఆదర్శంగా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం కృషి చేస్తూ, ఎన్నో సంస్కరణలు విజయవంతంగా అమలు చేస్తున్న లోకేశ్‌ను రాష్ట్రపతి అభినందించారు.
అనంతపురం, జులై 1: ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. విద్యా శాఖ మంత్రిగా దేశానికే ఆదర్శంగా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం కృషి చేస్తూ, ఎన్నో సంస్కరణలు విజయవంతంగా అమలు చేస్తున్న లోకేశ్‌ను రాష్ట్రపతి అభినందించారు. ఈ సంస్కరణలు కొనసాగాలని సూచించారు. ఈరోజు(బుధవారం) అనంతపురంలోని ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరై తిరిగి వెళుతున్నప్పుడు రాష్ట్రపతికి వీడ్కోలు పలికేందుకు హెలికాప్టర్ వరకు మంత్రి లోకేశ్ వెళ్లారు. తన దగ్గరకు మంత్రిని పిలిచిన రాష్ట్రపతి.. ఏపీలో విద్యాసంస్కరణలు, విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు చాలా బాగున్నాయని అభినందించారు. వీటిని కొనసాగించాలని సూచించారు.
విద్యార్థులు కేంద్రంగా సాగుతున్న విద్యా వ్యవస్థలో మార్పులు వారి బంగారు భవిష్యత్తుకు మార్గం వేస్తాయని రాష్ట్రపతి అన్నారు. స్నాతకోత్సవంలో మంత్రి లోకేశ్ ప్రసంగం స్ఫూర్తివంతంగా సాగిందని అభినందించారు. సభకు హాజరైన గ్రాడ్యుయేట్స్‌కు మంచి సందేశం ఇచ్చారని లోకేశ్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి...
సాయికృష్ణ కేసు.. మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు 14 రోజుల రిమాండ్
నేను బటన్ నొక్కే వ్యక్తిని కాదు.. ప్రజల్లో ఉండే వ్యక్తిని: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News