Share News

సాయికృష్ణ కేసు.. మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు 14 రోజుల రిమాండ్

ABN , Publish Date - Jul 01 , 2026 | 01:31 PM

సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో మరో ఇద్దరు పోలీసులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కేసులో నిందితులుగా ఉన్న కానిస్టేబుళ్లు బాబురావు, సాంబయ్యలను అదుపులోకి తీసుకున్న అధికారులు.. వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపర్చారు.

సాయికృష్ణ కేసు.. మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు 14 రోజుల రిమాండ్
Sai Krishna case

విజయవాడ, జులై 1: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో మరో ఇద్దరు పోలీసులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కేసులో నిందితులుగా ఉన్న కానిస్టేబుళ్లు బాబురావు, సాంబయ్యలను అదుపులోకి తీసుకున్న అధికారులు.. వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జిల్లా కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా కోర్టుకు సిట్ అధికారులు.. రిమాండ్ రిపోర్ట్‌ను సమర్పించారు. ఇద్దరు కానిస్టేబుళ్లకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వారిని అవనిగడ్డ జైలుకు తరలించాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.


రిమాండ్ రిపోర్ట్‌లోని అంశాలు..

‘బాబురావు, సాంబయ్య సాక్ష్యాలను మాయం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ హార్డ్ డిస్క్‌లను మార్చేశారు. వేరే హార్డ్ డిస్క్‌లను అమర్చి సాక్ష్యాలను ధ్వంసం చేశారు. సాయికృష్ణ మృతదేహం ఎక్కడుందో ఇప్పటికీ తెలియలేదు. అరెస్ట్ అయిన నిందితులు విచారణకు సహకరించడం లేదు. దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారు. పోలీసులు కావడంతో సాక్ష్యాలను ప్రభావతం చేసే అవకాశం ఉంది’ అంటూ రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ అధికారులు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

దేశంలోనే అత్యధిక పెన్షన్ల పంపిణీలో ఏపీ రికార్డ్: ఎంపీ కేశినేని శివనాథ్

కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్కుల నీరు విడుదల

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 01 , 2026 | 01:47 PM