Share News

బీఆర్‌ఎస్ కోసమే బీజేపీ రైతు యాత్ర: ప్రభుత్వ విప్ వేముల వీరేశం

ABN , Publish Date - May 26 , 2026 | 12:54 PM

బీజేపీ నాయకులు చేసేది దద్దమ్మల యాత్ర అని ప్రభుత్వ విప్ వేముల వీరేశం వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు డ్రామా చేస్తున్నారని.. యాత్రలు చేసే వాళ్లు వస్తుంటారు, పోతుంటారని అన్నారు.

బీఆర్‌ఎస్ కోసమే బీజేపీ రైతు యాత్ర: ప్రభుత్వ విప్ వేముల వీరేశం
Vemula Veeresham

హైదరాబాద్, మే 26: బీజేపీ నాయకులు చేపట్టిన రైతు యాత్రపై ప్రభుత్వ విప్ వేముల వీరేశం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈరోజు(మంగళవారం) సీఎల్పీ మీడియా హాల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు చేసేది దద్దమ్మల యాత్ర అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు డ్రామా చేస్తున్నారని.. యాత్రలు చేసే వాళ్లు వస్తుంటారు, పోతుంటారని అన్నారు. బీఆర్‌ఎస్ చేసిన దుర్మార్గాల వల్లే ఈ సమస్యలు తలెత్తాయని విమర్శించారు. బీఆర్‌ఎస్ కోసమే వాళ్ల బీ-టీమ్ బీజేపీ రైతు యాత్ర చేస్తోందని వేముల వీరేశం ఆరోపించారు.


‘మీ ప్రోగ్రెస్ కార్డులో మోదీ అటెండెన్స్ కోసమే బీజేపీ ఈ యాత్ర చేస్తోంది’ అని ప్రభుత్వ విప్ వ్యాఖ్యానించారు. ధాన్యాన్ని ప్రధాని మోదీతో కొనిస్తామని బీజేపీ నేతలు చెప్పాలని.. ప్రతి గింజను కొనమని ప్రధానిని ఒప్పించాలని సవాల్ విసిరారు. దేశంలో చేతకాని ప్రభుత్వం ఉందని.. ఏమీ చేయలేని బీజేపీ నేతలు పనీపాట లేక యాత్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. రైతు వ్యతిరేక పార్టీ బీజేపీ అని అన్నారు. రైతులకు వచ్చిన ఇబ్బందులకు కారణం మేమే అని బీజేపీ నేతలు చెప్పాలన్నారు. రైతుల దగ్గరికి వెళ్లిన బీజేపీ నేతలు.. వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎలాంటి ఇబ్బంది ఉండదని.. రైతులు పండించిన చివరి గింజ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొంటుందని ప్రభుత్వ విప్ వేముల వీరేశం స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ ఎడ్‌సెట్-2026 ఫలితాలు విడుదల

జగన్ పాలనలో జరిగిన హత్యలను ఆధారాలతో నిరూపిస్తాం: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 26 , 2026 | 01:09 PM