జగన్ పాలనలో జరిగిన హత్యలను ఆధారాలతో నిరూపిస్తాం: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
ABN , Publish Date - May 26 , 2026 | 12:08 PM
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో గ్రామాల్లో ఎన్ని హత్యలు జరిగాయో ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు.
నంద్యాల, మే 26: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ది ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే అంటూ వ్యాఖ్యానించారు. జగన్ ఐదేళ్ల పాలనలో గ్రామాల్లో ఎన్ని హత్యలు జరిగాయో ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు. జగన్ అరాచకాలను ప్రజలు భరించలేకనే 151 నుంచి 11 సీట్లు ఇచ్చారన్నారు. దేశంలో ప్రధానికి కూడా లేని ఇనుప కంచ భద్రత జగన్ మాత్రమే ఉందని.. అంత అభద్రతా భావంతో వైసీపీ అధినేత ఉన్నారని అన్నారు. రాజారెడ్డిలో ఉండే క్రూర స్వభావాలు మొత్తం జగన్‌కు వచ్చాయని మంత్రి దుయ్యబట్టారు.
ఇప్పటికీ బెదిరించే స్వభావంతోనే జగన్ మాట్లాడుతున్నారని బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. పరిశ్రమలు పెట్టే వాళ్లను బెదిరించే ధోరణిలో జగన్ ప్రవర్తన ఉందన్నారు. 17 సంవత్సరాల క్రితం జరిగిన రాజారెడ్డి హత్య గురించి జగన్ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ‘మీ ప్రభుత్వంలో మీ కుటుంబంలో జరిగిన హత్యలపై ఎందుకు విచారణ జరిపించలేదు’ అని జగన్‌ను నిలదీశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందన్నారు. పత్రికా ప్రతినిధులపై దాడులు చేస్తున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
‘నన్ను ప్రశ్నించండి’.. కొత్త కార్యక్రమానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి శ్రీకారం
ఏపీ ఎడ్‌సెట్-2026 ఫలితాలు విడుదల
Read Latest AP News And Telugu News