నీది మేనేజ్‌మెంట్ కోటా.. నాది మెరిట్ కోటా!
ABN , Publish Date - Nov 05 , 2026 | 05:35 AM
‘ట్విట్టర్ టిల్లూ.. నీది మేనేజ్‌మెంట్ కోటా.. నాది మెరిట్ కోటా. అయ్య పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చి పదవులు సంపాదించుకున్న చరిత్ర నీది..
నన్ను బౌన్సర్ అంటూ అవహేళన చేస్తావా?
పార్టీ కార్యకర్తలను పట్టించుకోని చరిత్ర మీదే
కేటీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజం
హైదరాబాద్, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ‘ట్విట్టర్ టిల్లూ.. నీది మేనేజ్‌మెంట్ కోటా.. నాది మెరిట్ కోటా. అయ్య పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చి పదవులు సంపాదించుకున్న చరిత్ర నీది.. కష్టపడి జనం కోసం లాఠీదెబ్బలు తిని, ఉద్యమాలు చేసిన చరిత్ర నాది’ అని కేటీఆర్‌ను ఉద్దేశించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అమిత్‌షా పాదయాత్రకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలను క్రమబద్ధీకరించిన తనను బౌన్సర్ అంటూ హేళన చేయడం సరికాదన్నారు. కార్యకర్తలపై బౌన్సర్లతో దాడులు చేయించిన సంస్కృతి తమది కాదని, అధికారంలో ఉన్నంతకాలం కార్యకర్తలను పట్టించుకోని చరిత్ర బీఆర్‌ఎస్‌దేనని బుధవారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు.
తెలంగాణ భూములను దోచుకున్న ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కుతుందని ఆరోపించారు. గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గాలి కొదిలేసిందని, మియాపూర్ భూములను సైతం దోచుకోవాలని చూసిందని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోందని మండిపడ్డారు. మియాపూర్ భూములను అమ్మి ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టేందుకు సిద్ధమవుతోందని ధ్వజమెత్తారు. కాగా, ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మరణించడం అత్యంత బాధాకరమని బండి సంజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని ఆర్టీసీ కార్మికులపై చూపొద్దని ప్రజలను కోరారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆర్టీసీ కార్మికులు ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్నారని కొనియాడారు. కార్మికుల పట్ల ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కండక్టర్ ప్రవళికకు కన్నీటి వీడ్కోలు
స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు ఇక సులువుగా ఫైర్ ఎన్‌వోసీ!
7 గంటల్లో రూ.7.80 కోట్లు స్వాహా
Read Latest Telangana News And AP News And National News
And Telugu News