హైదరాబాద్‌లో ఆరునెలల గర్భవతిని హత్య చేసిన భర్త
ABN , Publish Date - Sep 14 , 2026 | 10:26 AM
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి సూర్యనగర్‌లో దారుణం జరిగింది. ఆరునెలల గర్భవతిగా ఉన్న భార్యను గొంతు నులిమి భర్త హతమార్చాడు.
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి సూర్యనగర్‌లో దారుణం జరిగింది. ఆరునెలల గర్భవతిగా ఉన్న భార్యను గొంతు నులిమి భర్త హతమార్చాడు. సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకుని అల్వాల్ పోలీసులు వివరాలు సేకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరునెలల క్రితం పరశురామ్ దంపతులకు వివాహం జరిగింది. భార్యపై అనుమానంతో హతమార్చి ఉండవచ్చని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రోశయ్య దూరదృష్టితోనే తెలంగాణకు మిగులు బడ్జెట్: సీఎం రేవంత్‌రెడ్డి
ఢీ10 డ్యాన్స్ విన్నర్ రాజు కేసు.. బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డ్
మట్టి వినాయకుడిని పూజించాలి: హరీశ్‌రావు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News