Share News

డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు.. కీలకపత్రాల స్వాధీనం

ABN , Publish Date - Sep 24 , 2026 | 05:31 PM

అక్రమ ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎస్పీకి బినామీలుగా చెలామణి అవుతున్న 8 మందిని ఏసీబీ సాక్ష్యాధారాలతో పట్టుకుంది. ఈ మేరకు వారి ఇళ్లల్లో నిర్వహించిన సోదాలపై ప్రెస్‌నోట్ విడుదల చేసింది.

డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు.. కీలకపత్రాల స్వాధీనం
acb raids on dsp bheemreddy binami houses

హైదరాబాద్, సెప్టెంబర్ 24: అక్రమ ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డికి బినామీలుగా అనుమానిస్తున్న 8 మంది ఇళ్లల్లో ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, జహీరాబాద్‌లోని 10 ప్రాంతాల్లో ఈ సోదాలు చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.


భీమ్‌రెడ్డితో ఆర్థిక, ఇతర లావాదేవీలు ఉన్నట్లు అనుమానిస్తున్న వారి ఇళ్ల నుంచి పలు కీలక పత్రాలు, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు తెలిపారు. బొమ్మ వెంకటేష్ అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేయగా.. రూ.1.35 కోట్ల అక్రమ నగదును గుర్తించామని వారు తెలిపారు.


అంతేకాకుండా.. భారీగా విదేశీ కరెన్సీని, సుమారు 14 లీటర్ల విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. అక్రమ మద్యం విషయాన్ని ఎక్సైజ్ శాఖకు తెలియజేశామన్నారు. ఈ మేరకు అక్రమ మద్యానికి సంబంధించి.. ఎక్సైజ్ చట్టాల ప్రకారం సంబంధిత పోలీసులు కేసు నమోదు చేస్తారని ఏసీబీ అధికారులు తెలిపారు.


ఈ వార్తలనూ చదవండి:

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు అభిజీత్ దీప్కే అల్టిమేటమ్.. 48 గంటల్లో రాజీనామా చేయకపోతే..

ఆ భయంకర సాఫ్ట్‌వేర్‌ని రద్దు చేయండి.. ఈసీఐనెట్ యాప్‌పై శశిథరూర్

Updated Date - Sep 24 , 2026 | 05:49 PM