Share News

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు అభిజీత్ దీప్కే అల్టిమేటమ్.. 48 గంటల్లో రాజీనామా చేయకపోతే..

ABN , Publish Date - Sep 24 , 2026 | 03:32 PM

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై తక్షణం రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. లేకపోతే దేశవ్యాప్త నిరసనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు అభిజీత్ దీప్కే అల్టిమేటమ్.. 48 గంటల్లో రాజీనామా చేయకపోతే..
CJP Abhijit Deepke Demands CEC Resignation

కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై (CEC Gyanesh Kumar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశప్రజాస్వామ్యానికి సీఈసీ అతిపెద్ద ముప్పుగా మారారని అన్నారు. తక్షణం రాజీనామా (Resignation) చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే 48 గంటల్లోగా ఆయన రాజీనామా చేయకపోతే దేశవ్యాప్త నిరసనలకు తెరతీస్తామని అల్టిమేటమ్ జారీ చేశారు.

సర్ ప్రక్రియకు సంబంధించి ఇతర ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలను పక్కన పెట్టి సీఈసీ ముందుకెళ్లినట్టు వెలుగులోకి రావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఓటర్ల తొలగింపు, తిరిగి చేర్చే విధానంపై ఈసీలు సుఖ్‌బీర్ సంధూ, వివేక్ జోషి అభ్యంతరాలను పక్కనపెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజా పత్రికా సమావేశంలో అభిజీత్ దీప్కే సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై మండిపడ్డారు. ఈ ఉదంతాలు ప్రధాన ఎన్నికల కమిషనర్ దేశంలోనే అతిపెద్ద దేశద్రోహి అని నిరూపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య సూత్రాలకు వ్యతిరేకంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.


జ్ఞానేశ్ కుమార్ సీఈసీగా బాధ్యతలు చేపట్టినప్పటి నాటి నుంచీ దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్లకు పైగా ఓట్లను (మొత్తం ఓటర్లలో సుమారు 12.4% నుండి 14%) రద్దు చేశారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అభిజీత్ దీప్కే అన్నారు. 2024 లోక్‌ సభ ఎన్నికల్లో అధికార NDA, ప్రతిపక్ష కూటమి మధ్య గెలుపోటముల వ్యత్యాసం కేవలం 2% మాత్రమే ఉందని గుర్తు చేశారు. ఆ తేడాను ప్రభావితం చేయడానికే ఈ స్థాయిలో ఓట్లు తొలగించారా అని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.


బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చనే భయంతోనే ప్రాంతీయ శక్తులను బలహీనపరిచేందుకు ఈ వ్యూహం పన్నారని ఆరోపించారు. పశ్చిమబెంగాల్లో మమత బెనర్జీ నియోజకవర్గాల నుంచి ఓట్లు తొలగించడం ఆమె ఓటమికి కారణమైంది చెప్పారు. సుమారు 1,00,000 ఓట్లు తొలగించటం తమిళనాడు ఎం.కె. స్టాలిన్ ఓటమికి దారితీసిందని అన్నారు. ఢిల్లీలో కూడా ఇదే జరిగిందని చెప్పారు. ప్రతిపక్ష నేతలను దెబ్బతీసేలా ఓట్ల తొలగింపులు జరుగుతుంటే, దానిని స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలు అని ఎలా అంటారని అభిజీత్ దీప్కే ప్రశ్నించారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా విషయంలో తాము వెనక్కు తగ్గేదే లేదని తేల్చి చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

ఆ భయంకర సాఫ్ట్‌వేర్‌ని రద్దు చేయండి.. ఈసీఐనెట్ యాప్‌పై శశిథరూర్

కుల వివక్ష ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర.. ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌కు మాజీ చీఫ్ మద్దతు

Updated Date - Sep 24 , 2026 | 04:14 PM