• Home » Anti Corruption Bureau

Anti Corruption Bureau

Anti Corruption Transfers: అవినీతి తగ్గాలంటే ఆఫీసర్లకు బదిలీలు తప్పనిసరి

Anti Corruption Transfers: అవినీతి తగ్గాలంటే ఆఫీసర్లకు బదిలీలు తప్పనిసరి

పార్లమెంటరీ ప్యానెల్‌ అభిప్రాయం ప్రకారం, మంత్రిత్వ శాఖల్లో అధికారులు ఒకే పదవిలో ఎక్కువకాలం పనిచేస్తే అవినీతి పెరిగే అవకాశం ఉంటుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి బదిలీల విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని సూచించడమే కాకుండా, అన్ని బదిలీలు వెంటనే జరగాలని స్పష్టం చేసింది. నిర్దేశిత కాలపరిమితికి మించి అధికారి కొనసాగకూడదని కమిటీ పేర్కొంది

ఏసీబీ నుంచి ప్రభుత్వ అధికారులకు ఫోన్లు రావు

ఏసీబీ నుంచి ప్రభుత్వ అధికారులకు ఫోన్లు రావు

అవినీతి నిరోధక శాఖ నుంచి ఏ ప్రభుత్వ అధికారికి ఫోన్లు రావని, అలా ఎవరైనా ఏసీబీ పేరు చెప్పి ఫోన్లు చేసి డబ్బు డిమాండ్‌ చేస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డైరక్టర్‌ జనరల్‌ విజయకుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Anti Corruption Bureau : గనుల ఫైళ్లు గల్లంతు

Anti Corruption Bureau : గనుల ఫైళ్లు గల్లంతు

గనుల శాఖలో దొంగలు పడ్డారు. నాడు జగన్‌ ప్రభుత్వంలో మైనింగ్‌ కంపెనీల నుంచి బలవంతంగా వాటాలు తీసుకొని సెటిల్‌ చేసిన కీలక ఫైళ్లు ఇప్పుడు కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం రాకముందే వాటిని మాయం చేసేశారు.

Corrupt Officials : కోరల్లేని ఏసీబీ!

Corrupt Officials : కోరల్లేని ఏసీబీ!

యుద్ధం గట్టిగా చేయండి.. సైనికులను, టీమ్‌ లీడర్లను మాత్రం ఇవ్వం.. అంటే విజయం సంగతి దేవుడికి ఎరుక! అసలు బరిలో దిగడం సాధ్యమేనా? ఇప్పుడు రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) పరిస్థితి కూడా ఇదే.

Ponguleti: పాత పద్ధతులు,పైరవీలు మర్చిపోండి..

Ponguleti: పాత పద్ధతులు,పైరవీలు మర్చిపోండి..

ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి హెచ్చరించారు.

Madras High Court : భర్త తరఫున లంచం తీసుకుంటే భార్యకూ శిక్ష

Madras High Court : భర్త తరఫున లంచం తీసుకుంటే భార్యకూ శిక్ష

ప్రభుత్వ ఉద్యోగి తీసుకునే లంచంలో భార్యకు భాగస్వామ్యం ఉంటే ఆమె కూడా శిక్షకు అర్హురాలేనని మద్రాసు హైకోర్టు మదురై బెంచ్‌ అభిప్రాయపడింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో భర్తతో పాటు భార్యకు కూడా శిక్ష వేస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయడానికి తిరస్కరించింది.

Jogi Ramesh: జోగి రమేష్ అక్రమాలపై షాకింగ్ విషయాలు చెప్పిన ఏసీబీ

Jogi Ramesh: జోగి రమేష్ అక్రమాలపై షాకింగ్ విషయాలు చెప్పిన ఏసీబీ

అగ్రిగోల్డ్ స్కామ్ గంటగో మలుపు తిరుగుతోంది. మంగళవారం ఉదయం నుంచి వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు.. ఆయన కుమారుడు జోగి రాజీవ్‌ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ స్కామ్‌లో రాజీవ్ కీలక పాత్ర పోషించారని చెప్పిన ఏసీబీ (AP ACB) అధికారులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు...

Anti-corruption Department : రుచికరమైన సీటు

Anti-corruption Department : రుచికరమైన సీటు

ఆ అధికారి పనిచేసేది అవినీతి నిరోధక శాఖలో..! కానీ కంచె చేను మేసినట్లు ఆయనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏసీబీలో ఏ అధికారైనా మూడేళ్లు మాత్రమే పనిచేయాలి. కానీ ఆయన ఐదేళ్లుగా అదే సీటులో కొనసాగుతున్నారు. గతంలోనూ నాలుగేళ్లపాటు పనిచేశారు. ఏసీబీ డీఎస్పీ బదిలీ అయిన సందర్భంలో దాదాపు రెండేళ్లపాటు ఇనచార్జి డీఎస్పీగా ఉన్నారు. సీనియర్‌ సీఐని అంటూ వ్యవహారం నడిపారు. ఇప్పటికి అక్కడ పనిచేయబట్టి ఐదేళ్లయినా బదిలీ కాకుండా చక్రం తిప్పుతున్నారు. తాజాగా డీఎస్పీ బదిలీ కావడంతో మరోసారి ఇనచార్జి కుర్చీ కోసం తహతహలాడుతున్నారు. సంపాదన బాగా మరిగినందుకే ఆయన ‘అవినీతి’ నిరోధక శాఖను వీడటం లేదన్న ...

G20 Meet : భారత్‌లో అవినీతిని సహించని వ్యవస్థ : మోదీ

G20 Meet : భారత్‌లో అవినీతిని సహించని వ్యవస్థ : మోదీ

భారత దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించబోదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అవినీతి వల్ల ప్రజల జీవన నాణ్యత క్షీణిస్తుందని తెలిపారు. అవినీతి ప్రభావం వనరుల వినియోగంపైన ఉంటుందన్నారు. మార్కెట్లను కుదిపేస్తుందని, సేవల బట్వాడాను ప్రభావితం చేస్తుందని తెలిపారు.

Pakistan : ఇమ్రాన్‌ ఖాన్‌కు జైలు శిక్ష.. న్యాయ వ్యవస్థ నుదుట నల్ల మచ్చ.. : పీటీఐ

Pakistan : ఇమ్రాన్‌ ఖాన్‌కు జైలు శిక్ష.. న్యాయ వ్యవస్థ నుదుట నల్ల మచ్చ.. : పీటీఐ

తోషాఖానా బహుమతుల కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు జైలు శిక్ష విధించడంపై ఆయన నేతృత్వంలోని రాజకీయ పార్టీ పీటీఐ తీవ్రంగా స్పందించింది. ఈ శిక్ష విధించిన అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి హుమయూన్ దిలావర్ పక్షపాతంతో వ్యవహరించారని ఆరోపించింది. పక్షపాతంగల జడ్జి ఇచ్చిన పక్షపాతంతో కూడిన తీర్పును తిరస్కరిస్తున్నట్లు తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి