పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.5
ABN , Publish Date - Nov 17 , 2026 | 08:07 AM
జీహెచ్‌ఎంసీలోని ప్రధాన పార్కుల్లో ప్రవేశ రుసుము పెరిగింది. పెద్దలకు ప్రస్తుతం రూ.10గా ఉన్న రుసుమును రూ.20కి, పిల్లలకు రూ.2గా ఉన్న ఫీజు రూ.5కు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది.
పార్కుల్లో ప్రవేశ రుసుము పెంచుతూ జీహెచ్‌ఎంసీ నిర్ణయం
హైదరాబాద్ సిటీ: జీహెచ్‌ఎంసీలోని ప్రధాన పార్కుల్లో ప్రవేశ రుసుము పెరిగింది. పెద్దలకు ప్రస్తుతం రూ.10గా ఉన్న రుసుమును రూ.20కి, పిల్లలకు రూ.2గా ఉన్న ఫీజు రూ.5కు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రవేశ రుసుము పెంపు ప్రతిపాదనలకు అధికారులు ఆమోదం తెలిపారు. 12 యేళ్లు దాటిన వారికి రూ.20, ఐదు నుంచి 12 యేళ్లలోపు వారు రూ.5 రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఎప్పటిలాగానే ప్రవేశ రుసుము టికెట్లు ఇస్తారు.
ఇందిరాపార్కు, నారాయణగూడలోని మేల్కొటే, జలగం వెంగళరావు, కృష్ణకాంత్ తదితర ప్రధాన పార్కుల్లో పెంపు అమలు కానుంది. 2017లో పార్కుల ప్రవేశ రుసుమ రూ.5 నుంచి 10కి పెంచారు. తొమ్మిదేళ్ల అనంతరం మరోసారి పెంచినట్టు అర్బన్ బయోడైవర్సిటీ విభాగం వర్గాలు పేర్కొన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
మహిళా కాంగ్రెస్.. రెండో జాబితా విడుదల
గంజాయి అక్రమ రవాణా నిందితుడిపై పీడీ యాక్ట్
Read Latest AP News And Telangana News And International News And Telugu News