హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి.. ఒమన్ తీరానికి సమీపంలో ట్యాంకర్‌కు మంటలు..
ABN , Publish Date - Nov 17 , 2026 | 07:35 AM
పశ్చిమాసియాలో మళ్ల ఉద్రిక్తతలు మొదలయ్యాయి. హార్ముజ్ జలసంధిలో మరో చమురు నౌకపై తాజాగా దాడి జరిగింది. ఒమన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ట్యాంకర్‌పై దాడి జరిగడంతో నౌకలోని ఇంజిన్ గదిలో మంటలు చెలరేగాయి.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో మళ్ల ఉద్రిక్తతలు మొదలయ్యాయి. హార్ముజ్ జలసంధిలో మరో చమురు నౌకపై తాజాగా దాడి జరిగింది. ఒమన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ట్యాంకర్‌పై దాడి జరిగడంతో నౌకలోని ఇంజిన్ గదిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో అంతర్జాతీయ సముద్ర రవాణాపై మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి. ఈ నౌకను పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఓఎన్ ఫీనిక్స్‌గా గుర్తించారు. కాగా, ట్యాంకర్‌పై ఈ దాడిని ఇరాన్ నావీ కూడా ధ్రువీకరించింది (Strait of Hormuz Attack).
యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) వెల్లడించిన వివరాల ప్రకారం.. నవంబర్ 16న హార్ముజ్ జలసంధి గుండా బయటకు వెళ్తున్న ఓ ట్యాంకర్‌పై దాడి జరిగింది. దీంతో నౌకలోని ఇంజిన్ గదిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, నౌకలోని సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే నౌకకు జరిగిన నష్టం, సముద్రంలో చమురు లీకేజీ జరిగిందా లేదా అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఒమన్ తీరానికి సుమారు మూడు నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగింది (Oman Tanker Attack).
కాగా, ఆ నౌక తాము ఆంక్షలు విధించిన ప్రాంతంలో ప్రయాణిస్తోందని ఇరాన్ నావికాదళం తెలిపింది (Oil Tanker Fire). అంతేకాకుండా, నౌక తన నావిగేషన్ వ్యవస్థలను నిలిపివేసిందని పేర్కొంది. ఆంక్షలు ఉన్న ప్రాంతంలోకి ప్రవేశించవద్దని ఇరాన్ పలుమార్లు హెచ్చరించినప్పటికీ, ఆ నౌక సిబ్బంది వెనక్కి తగ్గలేదని ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ పేర్కొంది. కాగా, గడిచిన 24 గంటల్లో ఇది హోర్ముజ్‌లో జరిగిన నాలుగో దాడి కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఇవి కూడా చదవండి..
స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
భారత్‌లో ఓ భిన్నమైన దృశ్యం కనిపించింది: ప్రిన్స్ విలియమ్