భారత్‌లో ఓ భిన్నమైన దృశ్యం కనిపించింది: ప్రిన్స్ విలియమ్
ABN , Publish Date - Nov 16 , 2026 | 07:42 PM
పర్యావరణహిత ఇంధనాల్ని ప్రోత్సహించడంలో భారత్ సాధిస్తున్న పురోగతిని బ్రిటన్ రాజకుమారుడు విలియమ్ ప్రశంసించారు.
ఇంటర్నెట్ డెస్క్: పర్యావరణహిత ఇంధనాల్ని ప్రోత్సహించడంలో భారత్ సాధిస్తున్న పురోగతిని బ్రిటన్ రాజకుమారుడు విలియమ్ ప్రశంసించారు. ఎర్త్‌షాట్ ప్రైజ్ ప్రదాన కార్యక్రమం కోసం భారత్‌కు వచ్చిన ఆయన సోమవారం ఈ ఈవెంట్‌కు సంబంధించి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత్‌పై ప్రశంసలు కురిపించారు. స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో 50 శాతం శిలాజయేతర ఇంధనాల ద్వారా సమకూరాలన్న లక్ష్యాన్ని భారత్ డెడ్‌లైన్‌కు 5 ఏళ్ల ముందే చేరుకోవడంపై అభినందనీయమని అన్నారు. భారత్‌లో సౌర ఇంధన వినియోగం వేగంగా పెరుగుతోందని అన్నారు. వాతావరణ మార్పుల సంబంధిత సమస్యలకు పరిష్కారాల్లో భారత్ పాత్ర పెరుగుతోందని చెప్పారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల ముందు ఆర్థికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ అనే వేర్వేరు ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉన్నాయనే తప్పుడు భావన ఉందని ప్రిన్స్ విలియమ్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ రెండిటిని కలిపి అభివృద్ధి పథాన నడవొచ్చని భారత్ నిరూపించిందని చెప్పారు. రంగులమయమైన, సంక్లిష్టమైన, పలు ప్రత్యామ్నాయాలతో కూడిన ఓ కొత్త చిత్రాన్ని భారత్ చూపించిందని ప్రిన్స్ విలియమ్ వ్యాఖ్యానించారు. భారత్‌లో సౌరవిద్యుత్ సామర్థ్యం దశాబ్దకాలంలోనే 50 రెట్లు పెరిగిందని మెచ్చుకున్నారు.
రేపు ముంబైలో ఎర్త్‌షాట్ ప్రైజ్ ప్రదాన కార్యక్రమం జరగనుంది. పర్యావరణ సమస్యలకు పరిష్కారాలు చూపించిన ఐదురుగు విజేతలకు ఒక్కొక్కరికీ 1 మిలియన్ పౌండ్లు బహుమతిగా ఇవ్వనున్నారు. ఇప్పటికే 15 మంది ఫైనలిస్టులను ఎంపిక చేశారు. రేపు విజేతనలను ప్రకటిస్తారు. ప్రిన్స్ విలియమ్ 2020లో ఈ బహుమతిని ఏర్పాటు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు కాపాడలేవు.. బిగ్ బీకి బెదిరింపులు
ఎన్నికల సంఘానికి 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ