Share News

టీమ్‌ వర్క్‌తో ఆర్టీసీని అగ్రగామిగా నిలపాలి

ABN , Publish Date - Nov 17 , 2026 | 06:59 AM

టీమ్‌ వర్క్‌తో పని చేసి దేశంలోనే టీజీఎస్‌ ఆర్టీసీని అగ్రగామి సంస్థగా నిలపాలని సిబ్బంది, అధికారులకు ఆ సంస్థ నూతన మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) అనిల్‌ కుమార్‌ హితవు చెప్పారు.

టీమ్‌ వర్క్‌తో ఆర్టీసీని అగ్రగామిగా నిలపాలి
TGSRTC New MD Anil Kumar

  • అధికారులు, సిబ్బందికి ఆర్టీసీ ఎండీ అనిల్‌ కుమార్‌ హితవు

హైదరాబాద్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): టీమ్‌ వర్క్‌తో పని చేసి దేశంలోనే టీజీఎస్‌ ఆర్టీసీని అగ్రగామి సంస్థగా నిలపాలని సిబ్బంది, అధికారులకు ఆ సంస్థ నూతన మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) అనిల్‌ కుమార్‌ హితవు చెప్పారు. ఆధునిక సాంకేతికతను అంది పుచ్చుకుని.. ప్రయాణికుల ఆదరణను మరింత పెంచుకోవాలన్నారు.


ఆర్టీసీ ఎండీగా సోమవారం బాధ్యతలు స్వీకరించాక ఆయన మాట్లాడుతూ.. సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని, వారి సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నిలిపి.. సంస్థను మరింత బలోపేతం చేస్తామని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Updated Date - Nov 17 , 2026 | 06:59 AM