Share News

ఉమ్మడి ఏపీ శాసనమండలి మాజీ ఛైర్మన్ చక్రపాణి కన్నుమూత

ABN , Publish Date - Nov 04 , 2026 | 06:37 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ ఛైర్మన్ డాక్టర్ ఎ. చక్రపాణి కన్నుమూశారు. ఈరోజు (బుధవారం) హైదరాబాద్‌లోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు.

ఉమ్మడి ఏపీ శాసనమండలి మాజీ ఛైర్మన్ చక్రపాణి కన్నుమూత
Chakrapani

హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ ఛైర్మన్ డాక్టర్ ఎ. చక్రపాణి (A. Chakrapani) కన్నుమూశారు. ఈరోజు (బుధవారం) హైదరాబాద్‌లోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. శాసన వ్యవస్థలో విశేష అనుభవం కలిగిన నేతగా, పార్లమెంటరీ సంప్రదాయాలను గౌరవించిన వ్యక్తిగా చక్రపాణి ప్రత్యేక గుర్తింపు పొందారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలిని పునరుద్ధరించిన అనంతరం తొలి ఛైర్మన్‌గా డాక్టర్ ఎ. చక్రపాణి బాధ్యతలు చేపట్టారు. తన పదవీకాలంలో సభా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు శాసనసభా సంప్రదాయాల పరిరక్షణకు ఆయన విశేష కృషి చేశారు. సభలో ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ విధానాలకు ప్రాధాన్యం ఇస్తూ తనదైన ముద్ర వేశారు.


చక్రపాణి మృతిపై సీఎం రేవంత్ సంతాపం..

CM-Revanth-Reddy.jpg

చక్రపాణి మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనమండలి తొలి ఛైర్మన్‌గా ఆయన అందించిన సేవలను సీఎం గుర్తుచేసుకున్నారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో కొనసాగుతూ అంకితభావంతో ఎన్నో సేవలందించారని కొనియాడారు. ఆయన మరణం రాష్ట్ర రాజకీయ, శాసన వ్యవస్థకు తీరని లోటని కీర్తించారు. పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్ హయాంలో తెలంగాణ సొత్తును కొల్లగొట్టారు.. మంత్రి పొంగులేటి ధ్వజం

సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ: డీజీపీ ఆనంద్

బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ‘సర్’ను వాడుతోంది.. ఎంపీ చామల ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 06:58 PM