Share News

మంచిర్యాల జిల్లాలో నీటి కుంటలో దిగి ముగ్గురి మృతి

ABN , Publish Date - Oct 25 , 2026 | 05:56 PM

మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం సమీపంలో విషాదకర ఘటన జరిగింది. నీటి కుంటలో దిగి ప్రమాదవశాత్తూ ముగ్గురు మృతిచెందారు.

మంచిర్యాల జిల్లాలో నీటి కుంటలో దిగి ముగ్గురి మృతి
Mancherial incident

మంచిర్యాల జిల్లా, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం సమీపంలో విషాదకర ఘటన జరిగింది. నీటి కుంటలో దిగి ప్రమాదవశాత్తూ ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటనలో మృతులను మణెమ్మ (24), కీర్తన(16), కావ్య(9)గా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.


వివరాల్లోకి వెళ్తే.. మృతులది వలస కుటుంబం. వారు ఇందారం గ్రామానికి వచ్చి అక్కడ స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో గ్రామసమీపంలోని నీటికుంటలో బట్టలు ఉతికేందుకు దిగారు. ప్రమాదవశాత్తూ నీటి కుంటలో మునిగి ముగ్గురు మృతిచెందారు. వారి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



ఈ వార్తలు కూడా చదవండి..

గచ్చిబౌలిలో 3.5 ఎకరాల్లో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు

నా చిన్నతనంలో అన్యాయాలను చూడలేకే నక్సలైట్ అయ్యా: మంత్రి సీతక్క

ఆ పరీక్షను వాయిదా వేయాలి.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 25 , 2026 | 06:30 PM