Share News

సరస్వతి అమ్మవారి చెంతకు మరింత చేరువగా..

ABN , Publish Date - Nov 12 , 2026 | 04:31 AM

చదువుల తల్లి జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనార్థం హైదరాబాద్‌ నుంచి బాసరకు వెళ్లే భక్తులకు ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి.

సరస్వతి అమ్మవారి చెంతకు మరింత చేరువగా..
Hyderabad to Basara New Route

  • హైదరాబాద్‌ - బాసరకు కొత్త రూట్‌

  • అందుబాటులోకి ఎన్‌హెచ్‌-161 బీబీ

  • ఎన్‌హెచ్‌ 44 రద్దీకి చెక్‌.. తగ్గిన ప్రయాణ సమయం

బాసర, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): చదువుల తల్లి జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనార్థం హైదరాబాద్‌ నుంచి బాసరకు వెళ్లే భక్తులకు ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి. ఇప్పటి వరకు ప్రధాన మార్గంగా ఉన్న నేషనల్‌ హైవే 44పై విపరీతమైన వాహనాల రద్దీ, తరచూ జరిగే ప్రమాదాలతో గంటల తరబడి ప్రయాణం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో యాత్రికుల కోసం మరో సరికొత్త జాతీయ రహదారి అందుబాటులోకి వచ్చింది. ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేలా ప్రభుత్వం అభివృద్ధి చేసిన నేషనల్‌ హైవే 161 (161 బీబీ) ప్రయాణికులకు గొప్ప ఊరటనివ్వనుంది.


సుమారు 25 సంవత్సరాల క్రితం విస్తరించిన ఎన్‌హెచ్‌ 44 (మేడ్చల్‌- కామారెడ్డి-నిజామాబాద్‌ మీదుగా బాసర) మార్గంలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ఇది ఫోర్‌-లేన్‌ రోడ్‌ అయినప్పటికీ రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల ఒత్తిడిని తట్టుకోలేక తరచూ ట్రాఫిక్‌ జామ్‌లు, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రయా ణానికి నాలుగున్నర గంటల నుంచి ఐదుగంటల సమయం పట్టేది. ఇక కొత్తగా అభివృద్ధి చేసిన ఎన్‌హెచ్‌ 161 బీబీ రహదారి నిర్మాణం పనులు ఇటీవల పూర్తయి.. రాకపోకలు ప్రారంభమయ్యాయి.


పటాన్‌చెరు మీదుగా ప్రయాణం

కొత్త మార్గం(ఎన్‌హెచ్‌-161)లో ప్రయాణించే భక్తులు, ప్రజలు హైదరాబాద్‌ నుంచి పటాన్‌చెరు, సంగారెడ్డి మీదుగా జోగిపేట్‌, పిట్లం, బోధన్‌ల ద్వారా నేరుగా బాసరకు చేరుకోవచ్చు. కేవలం 200ల కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ మార్గంలో వాహనాల తాకిడి చాలా తక్కువగా ఉండటంతో ప్రయాణం సుఖవంతంగా సాగుతోంది. మొత్తంగా మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో బాసరకు చేరుకోవచ్చు. అంతేకాకుండా ఈ మార్గంలో రెండు టోల్‌గేట్లు మాత్రమే ఉండటంతో ప్రయాణికులకు సమయంతో పాటు జేబు భారం కూడా తగ్గుతుంది.


ఈ వార్తలు కూడా చదవండి.

ఆంధ్రకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు

ప్రజాస్వామ్య పరిరక్షణకే భారత్‌ సమ్మిట్‌ 2.0

వరి పంట తప్ప..!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 04:31 AM