Share News

క్లాస్‌లో టాపర్‌.. కానీ ఉరేసుకున్నాడు..!

ABN , Publish Date - Nov 24 , 2026 | 05:42 AM

అతడి పేరు చల్ల సంపత్‌ (20).. తండ్రి మరణంతో కుంగిపోలేదు.. చదువులో టాపర్‌.. యూనివర్సిటీ ఫీజుల సమస్యే లేదు. ఆయన బాబాయి బ్యాంకు ఖాతా నుంచి సంపత్‌ ఖాతాకు రూ.80 వేలు వచ్చాయి. కానీ..

క్లాస్‌లో టాపర్‌.. కానీ ఉరేసుకున్నాడు..!

  • బాసర ఆర్జీయూకేటీలో విషాదం

బాసర, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): అతడి పేరు చల్ల సంపత్‌ (20).. తండ్రి మరణంతో కుంగిపోలేదు.. చదువులో టాపర్‌.. యూనివర్సిటీ ఫీజుల సమస్యే లేదు. ఆయన బాబాయి బ్యాంకు ఖాతా నుంచి సంపత్‌ ఖాతాకు రూ.80 వేలు వచ్చాయి. కానీ, ఆ విద్యార్థి తన హాస్టల్‌ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నిర్మల్‌ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ)లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రస్తుతం సీఎ్‌సఈ సెకండియర్‌ చదువుతున్న సంపత్‌.. సహచర విద్యార్థులు రాత్రి 8.30 గంటలకు భోజనానికి వెళ్లినప్పుడు తన గదిలో ఉరేసుకున్నాడు.


ఈ విషయం గమనించిన సహచర విద్యార్థులు, సిబ్బంది ఆయన్ను చికిత్స కోసం భైంసా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. సంపత్‌ ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలను అధికారులు వెల్లడించలేదు. కాగా, పోలీసుల విచారణలో సంపత్‌కు ఆయన బాబాయి రూ.80వేలు పంపినట్లు తేలింది. అంత డబ్బును ఎందుకు తెప్పించుకున్నాడు..? బెట్టింగ్‌లకు బానిసయ్యాడా..? రుణ యాప్‌ల వేధింపులతో ఒత్తిడికి గురై అఘాయిత్యానికి పాల్పడ్డాడా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి: పవన్ కల్యాణ్

వైసీపీకి మిగిలేది కక్షలు, అప్పులే.. సోమిరెడ్డి సెటైర్లు

ఏపీలో మేయర్లు, ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకారానికి వేళాయే..

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 05:42 AM