Share News

తన భూమిని కబ్జా చేశారంటూ... ప్రజావాణిలో రైతు ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Nov 24 , 2026 | 04:37 AM

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణిలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది.

తన భూమిని కబ్జా చేశారంటూ... ప్రజావాణిలో రైతు ఆత్మహత్యాయత్నం

  • చికిత్స కోసం రిమ్స్‌కు తరలింపు

ఆదిలాబాద్‌ టౌన్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణిలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. ఆదిలాబాద్‌ జిల్లా భోరజ్‌ మండలం హత్తిఘాట్‌కు చెందిన రైతు అనుముల దేవన్న తన ఐదెకరాల భూమిని మరొకరు కబ్జా చేశారని.. అధికారుల దృష్టికి తెచ్చేందుకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి వచ్చాడు.


ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగు రామన్న రిమ్స్‌లో బాధితుడిని పరామర్శించారు. రైతు భూ వివాదం సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!

తెలంగాణలో ష్నైడర్‌ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 04:37 AM