Share News

పాన్ కార్డ్ పోయిందా..? తిరిగి పొందండిలా..!

ABN , Publish Date - Oct 05 , 2026 | 03:32 PM

మీ పాన్ కార్డ్ పొయిందా..? కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ప్రక్రియ ద్వారా తిరిగి పొందండి.

పాన్ కార్డ్ పోయిందా..? తిరిగి పొందండిలా..!
Duplicate PAN Card

ఇంటర్నెట్ డెస్క్: ఈరోజుల్లో చాలా పనులు పూర్తి కావాలంటే పాన్ కార్డ్ తప్పనిసరి. బ్యాంక్ ఖాతా తెరవాలన్న, ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలన్న ఇది ఉండి తీరాలి. అయితే కొందరు పాన్ కార్డ్‌ను పోగొట్టుకుంటారు. అలాంటి సందర్భాల్లో తెగ కంగారు పడుతుంటారు. మళ్లీ పాన్ కార్డ్ పొందడం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాలని ఆందోళన చెందుతారు. అయితే అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. పాన్ కార్డ్ తిరిగి పొందేందుకు ఇంట్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలో తెలుసుకుందాం రండి.


పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి

పోయిన పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం కంటే ముందు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం మంచిది. ఒకవేళ ఎవరైనా మీ పాన్ కార్డుతో ఆర్థిక నేరానికి పాల్పడితే.. అది మీ మీదకు రాకుండా ఉండాలంటే ఫిర్యాదు చేయడం ముఖ్యం. అంతేకాక ఈ ఫిర్యాదు కాపీని డూప్లికేట్ పాన్ కార్డ్ దరఖాస్తులో జతచేయొచ్చు.

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

ఫిర్యాదు చేసిన తరువాత మీరు డూప్లికేట్ పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎన్ఎస్‌డీఎల్ అధికారిక వైబ్‌సైట్‌ను సంప్రదించాలి. అక్కడ ‘రీప్రింట్ పాన్’ను ఎంచుకోవాలి. తరువాత ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వివరాలు నమోదు చేయాలి. ఆపై పుట్టిన తేదీ ఎంటర్ చేసి, సబ్మిట్ చేయాలి. ఓటీపీ ధ్రువీకరణ పూర్తయిన తరువాత రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అనంతరం 7 నుంచి 15 రోజుల్లో డూప్లికేట్ పాన్ కార్డ్ మీ ఇంటికి చేరుతుంది.


ఈ వార్తలూ చదవండి

పాన్ కార్డులో పేరు తప్పు పడిందా..? మొబైల్‌లోనే మార్చుకోండిలా..

కొత్త మొబైల్ రీచార్జ్ రూల్స్.. మీకు ఈ విషయాలు తెలుసా..

Updated Date - Oct 05 , 2026 | 03:39 PM