Share News

వైసీపీని వీడి టీడీపీలో చేరిన మైనార్టీ కుటుంబాలు

ABN , Publish Date - Oct 05 , 2026 | 02:01 PM

వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల కొనసాగుతోంది. తాజాగా సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.

వైసీపీని వీడి టీడీపీలో చేరిన మైనార్టీ కుటుంబాలు

అమరావతి, అక్టోబర్ 05: వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల కొనసాగుతోంది. తాజాగా సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ముస్లిం మైనార్టీ కుటుంబాలు భారీగా టీడీపీలో చేరాయి. సోమవారం స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నేత కందికుంట దుర్గాప్రసాద్ సమక్షంలో ఆయా కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారికి కుండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకు వంద శాతం స్థానాలను గెలిచి తీరుతామని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీలోని కొత్త, పాత వారందరికీ సముచితమైన స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ నియోజకవర్గవ్యాప్తంగా వైసీపీని వీడి.. టీడీపీలో చేరుతున్న వారిక సంఖ్య అంతకంతకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.


కొవ్వూరులో వైసీపీని వీడిన 200 మంది నేతలు..

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో కూడా వైసీపీకి భారీ షాక్ తగిలింది. దాదాపు 200 మంది వైసీపీ నేతలు.. ఆ పార్టీని వీడారు. వారంతా తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీలో నాయకత్వ లోపం వల్లే తామంతా టీడీపీలో చేరినట్లు పార్టీ కండువా కప్పుకున్న నేతలంతా వివరించారు.


అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠానికి దూరమైన తర్వాత వైసీపీని ఒక్కొక్కరుగా వీడుతున్న సంగతి తెలిసిందే. కానీ ఇటీవల కాలంలో ఆ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం జిల్లా వరకు ఇదే పరిస్థితి నెలకొంది. విజయనగరం జిల్లాలో జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీనుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు వైసీపీని వీడి.. టీడీపీలో చేరారు.


జిల్లాలోని ఆయన అనుచరులు జడ్పీటీసీ సభ్యులు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో జిల్లాలోని వైసీపీ బలహీన పడిందంటూ ఇప్పటికే ఓ ప్రచారం సాగుతోంది. అలాగే పలు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో పరిస్థితి కూడా దాదాపుగా ఇలాగే ఉంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగే సమయానికి వైసీపీ పూర్తిగా ఖాళీ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ఓ చర్చ కూడా సాగుతోంది.


నెల్లూరులో అదే తీరు..

నెల్లూరు జిల్లాలోని కావలి, సర్వేపల్లి నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారు. వారికి స్థానిక ఎమ్మెల్యేలు కావ్య కృష్ణారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. బోగోలు మండలం విశ్వనాథరావుపేటలోని వైసీపీ నేత పాశం రవీంద్రబాబుతో సహా 20 కుటుంబాలు టీడీపీ చేరాయి. అలాగే వరకవిపూడికి చెందిన 180 కుటుంబాలు టీడీపీ కండువా కప్పుకున్నాయి. అలాగే అరుంధతీ కాలనీ మొత్తం టీడీపీలో చేరింది.


ఇవి కూడా చదవండి..

రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్

భీమ్‌గల్ పీఎస్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. పోలీసులే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ

Updated Date - Oct 05 , 2026 | 02:19 PM