Share News

1980ల్లోకి తీసుకెళ్లే చాట్‌జీపీటీ టైమ్ మెషీన్.. ఎలాగంటే?

ABN , Publish Date - Sep 09 , 2026 | 04:43 PM

ఈ ప్రాంప్ట్స్‌తో మీ ఫొటోలను 1980ల నాటి వింటేజ్ స్టైల్‌లోకి మార్చేయొచ్చు. అప్పటి వాతావరణాన్ని, వేషధారణలను ఇప్పుడే క్రియేట్ చేయొచ్చు.

1980ల్లోకి తీసుకెళ్లే చాట్‌జీపీటీ టైమ్ మెషీన్.. ఎలాగంటే?
old-style wedding theme

ఇంటర్నెట్ డెస్క్: వింటేజ్ స్టైల్ ఫొటోలను చాలా మంది ఇష్టపడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ ప్రత్యేక కథనం. ఒక్క ప్రాంప్ట్ ఇస్తే చాలు చాట్‌జీపీటీ మిమ్మల్ని 1980ల నాటి వాతావరణానికి తీసుకెళ్తుంది. మీ చిత్రాలను వింటేజ్ ఫొటోలుగా మార్చేస్తుంది. మీ వేషధారణ కూడా అచ్చం పాత కాలంలో ఎలా ఉంటుందో అలాగే చేస్తుంది.


ఎలా చేయాలంటే.?

మొదట మనం ఎడిట్ చేయదలుచుకున్న ఫొటోను చాట్‌జీపీటీకి ఇవ్వాలి. తరువాత దానికి 1980 స్టైల్‌కు సంబంధించిన ప్రాంప్ట్ ఇచ్చి, ప్రత్యేక థీమ్‌ను ఎంచుకోవాలి. ఉదాహరణకు వెడ్డింగ్ పిక్చర్, వింటేజ్ మ్యాగజైన్ షూట్ లాంటివి ఎంపిక చేసుకోవాలి. ఇలా చేసిన తరవాత చాట్‌జీపీటీ ఫొటోలను ఎడిట్ చేసి ఇస్తుంది. అది నచ్చకపోతే ఫొటోల్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.

AI Image.jpgఇవిగో ప్రాంప్ట్స్..

  • 1980ల్లో వాతావరణం, వేషధారణతో ఫొటో క్రియేట్ చేయడం కోసం ఈ ప్రాంప్ట్‌ను ఉపయోగించండి.

'Transform this photograph into a realistic 1980s photograph while keeping my face, facial features and identity recognisable. Change my clothing, hairstyle and accessories to match the 1980s. Use period-appropriate styling, warm analogue lighting, subtle film grain, slightly faded colours and soft focus. Remove modern objects and make the image look like it was genuinely photographed in the 1980s rather than simply adding a vintage filter."

  • అప్పటి బాలివుడ్ స్టైల్‌లో వింటేజ్ ఫొటో కోసం ఈ ప్రాంప్ట్ వాడండి.

"Transform this photo into an authentic 1980s Bollywood studio portrait. Keep my facial features and identity recognisable. Give me period-appropriate Indian clothing, hairstyle and accessories. Use warm studio lighting, soft focus, subtle film grain and slightly faded colours. Make it look like a real photograph taken in India in the 1980s, not a modern photograph with a vintage filter."


  • అలనాటి సినీతారలా మారిపోవాలనుకుంటే కింది ప్రాంప్ట్‌ను ట్రై చేయండి.

Turn this photo into a glamorous 1980s Bollywood heroine portrait. Keep my face natural and recognisable. Give me a voluminous 1980s hairstyle, a colourful saree and statement jewellery. Place me in a classic Indian studio setting with warm lighting, soft focus and subtle analogue film grain

  • 80ల్లో పెళ్లి ఫొటో ఎలా ఉంటుందో తెలుసా.? అలానే మీ చిత్రం ఉండాలా.. ఇదిగో ప్రాంప్ట్

Imagine this photo was taken at an Indian wedding in the 1980s. Keep everyone's faces recognisable. Recreate the clothing, hairstyles, jewellery, decorations, lighting and photography style of an Indian wedding from that decade. Add realistic analogue film grain and the slightly imperfect look of an old family photograph


ఇవి కూడా చదవండి:

మరో పదేళ్లలో మనుషుల్ని ఏఐ చంపేయొచ్చు.. ఆంత్రోపిక్‌ పరిశోధకుడి సంచలన హెచ్చరిక..

మద్యం అమ్మకాలపై ‘ఏఐ’ నిఘా!

Updated Date - Sep 09 , 2026 | 05:29 PM