WPL 2026: ఈసారి పక్కా కప్ మాదే: శ్రీచరణి
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:25 PM
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో..! ఇప్పటివరకు కెప్టెన్‌గా ఉన్న లానింగ్.. యూపీకి వెళ్లిపోవడంతో.. ఆ జట్టుకు సారథిగా స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ నియమితురాలైంది. వరుసగా మూడు సీజన్లలో ఫైనల్లో ఓటమి చవిచూసిన ఈ జట్టు.. ఈసారి కప్పు కొట్టాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ 2026 సమరం మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. వన్డే ప్రపంచ కప్ టీమిండియా సొంతం చేసుకున్న తర్వాత.. ఈ టోర్నీకి ఈసారి మరింత ఆదరణ పెరిగిందనడంలో సందేహం లేదు. అయితే ఈ సీజన్(WPL 2026)లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్టులో..! ఇప్పటి వరకు కెప్టెన్‌గా ఉన్న లానింగ్ యూపీకి వెళ్లిపోవడంతో.. ఆ జట్టుకు సారథిగా స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ నియమితురాలైంది. వరుసగా మూడు సీజన్లలో ఫైనల్లో ఓటమి చవిచూసిన ఈ జట్టు.. ఈసారి కప్పు కొట్టాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ విషయంపై టీమిండియా స్టార్ బౌలర్ శ్రీచరణి(Shree charani) మాట్లాడింది.
‘గతేడాదిగా జెమీమా నాకు తెలుసు. మా మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఆమె నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. నేను ఎలా ఆడతాను? క్లిష్ట పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవుతాను? అనే విషయంలో ఆమెకు ఓ క్లారిటీ ఉంది. కాబట్టి మా మధ్య కమ్యూనికేషన్‌లో ఇబ్బందేం లేదు. జెమీమాలో నాకు నచ్చిన విషయం ఏంటంటే.. ఎదుటివారిని అర్థం చేసుకునే తీరు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎవరు ఎలా స్పందిస్తారు? ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఎలా రాబట్టాలో జెమీమాకు బాగా తెలుసు. ఆమె మాట్లాడే విధానం.. ఉత్సాహపరిచే తీరు చాలా ప్రత్యేకం. ఈ ఏడాది కచ్చితంగా మేమే కప్పు గెలుస్తాం’ అని శ్రీచరణి తెలిపింది.
పోటీ ఏమీ లేదు..
‘నేను ఒత్తిడి గురించి ఏ మాత్రం ఆలోచించను. నాకు తెలిసిన విషయాలపైనే ఫోకస్ పెడతాను. నా నైపుణ్యాలను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాను. ఫలితం గురించి ఆలోచించను. సహచర భారత స్పిన్నర్ వైష్ణవి శర్మ మెరుగైన ప్రదర్శనను నేను పోటీగా భావించను. మేమంతా జట్టు కోసమే ఆడుతాం. ఒక రోజు ఆమె రాణిస్తే.. మరో రోజు నేను రాణించవచ్చు. కానీ అది నాకు ముఖ్యం కాదు. జట్టు గెలవడమే నాకు కీలకం’ అని శ్రీచరణి చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్‌ను నిలబెట్టిన ధీరుడు.. హ్యాపీ బర్త్‌డే పాజీ!
నా ఫొటోలను మార్ఫింగ్ చేయొద్దు: భారత స్టార్ మహిళా క్రికెటర్