The Ashes: హెడ్, స్మిత్ భారీ శతకాలు.. 134 పరుగుల ఆధిక్యంలో ఆసీస్
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:16 PM
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ సిడ్నీ వేదికగా ఐదో టెస్టులో తలపడుతున్నాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ జట్టు.. 7 వికెట్లు కోల్పోయి 518 పరుగుల భారీ స్కోరు చేసింది. 166/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌పై కంగూరులు 134 పరుగుల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ సిడ్నీ వేదికగా ఐదో టెస్టులో తలపడుతున్నాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ జట్టు.. 7 వికెట్లు కోల్పోయి 518 పరుగుల భారీ స్కోరు చేసింది. 166/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. ట్రావిస్ హెడ్(163), స్టీవ్ స్మిత్(129*) అద్భుతమైన సెంచరీలు చేయడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌పై కంగూరులు 134 పరుగుల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఓపెనర్ ట్రావిస్ హెడ్ (163; 166 బంతుల్లో, 24 ఫోర్లు, 1 సిక్స్), స్టీవ్ స్మిత్ (129*; 205 బంతుల్లో, 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో ఆకట్టుకున్నారు. నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన నీసర్ 24 పరుగులు చేశాడు. చివరి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఉస్మాన్ ఖవాజా (17) బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. అలెక్స్ కేరీ (16), కామెరూన్ గ్రీన్ (37) సైతం పెద్దగా పరుగులు చేయలేదు. వెబ్‌స్టర్ 42* (58 బంతుల్లో, 4 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడన్ కార్సే 3, బెన్‌స్టోక్స్ 2, జోష్ టంగ్, జాకబ్ బెథెల్ తలో వికెట్ తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్‌ను నిలబెట్టిన ధీరుడు.. హ్యాపీ బర్త్‌డే పాజీ!
నా ఫొటోలను మార్ఫింగ్ చేయొద్దు: భారత స్టార్ మహిళా క్రికెటర్