AB de Villiers: సిరాజ్ దురదృష్టవంతుడు.. ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 06 , 2026 | 08:28 AM
సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్.. టీ20 ప్రపంచ కప్ 2026 జట్టులో ఎంపిక కాకపోవడం దురదృష్టకరం అని అభిప్రాయపడ్డాడు. సెలక్టర్లు ఆటగాళ్ల ఫామ్ కంటే.. జట్టు కూర్పుపైనే ఎక్కువ దృష్టి పెట్టారని అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్.. టీ20 ప్రపంచ కప్ 2026 జట్టులో చోటు సంపాదించుకోలేదు. ఈ విషయంపై సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్(AB de Villiers) స్పందించాడు. సిరాజ్‌ను ఎంపిక చేయకపోవడం దురదృష్టకరమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత సెలక్టర్లు ఆటగాళ్ల ఫామ్, నాణ్యత కంటే.. జట్టు కూర్పు పైనే ఎక్కువ దృష్టి పెట్టారని విశ్లేషించాడు.
‘మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) వన్డే జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తూ టీ20 ప్రపంచ కప్ జట్టులో ఎంపిక కాలేదు. జస్ర్పీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఎంపికయ్యారు. హర్షిత్ రాణా బ్యాటింగ్ కూడా చేయగలడు. అందుకే సెలక్టర్లు అతడిని జట్టులోకి తీసుకున్నారు. వారు కేవలం సీమ్ బౌలర్లకే ప్రాధాన్యం ఇవ్వలేదు. స్పిన్నర్ల మీద కూడా దృష్టి పెట్టారు. ఒకవేళ వారు సీమర్లతో పాతో పాటు వికెట్లు సాధిస్తే.. అది బోనస్ అవుతుంది’ అని ఏబీడీ అన్నాడు.
మహ్మద్ సిరాజ్ చివరిసారిగా టీమిండియా తరఫున జులై 2024లో టీ20 మ్యాచ్ ఆడాడు. జస్‌ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్‌తో కలిసి హర్షిత్ రాణా పేస్ బౌలింగ్ చేస్తున్నాడు. బ్యాట్‌తోనూ పరుగులు రాబట్టగలగడం అతడికి సానుకూలంగా మారింది. దీంతో జట్టు సమతూకం కోసం సెలక్టర్లు అతడి వైపు మొగ్గు చూపుతున్నారు.
మహ్మద్ సిరాజ్.. టీ20 జట్టుకు ఎంపిక కాకపోయినప్పటికీ జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో పాల్గోనున్నాడు. గతంలో ఏబీ డివిలియర్స్, మహ్మద్ సిరాజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) తరఫున ఐపీఎల్‌లో (IPL) పాల్గొన్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
Afghanistan Cricket: యువ బ్యాటర్ సంచలన రికార్డు.. ఒకే ఓవర్‌లో 48 పరుగులు
జో రూట్ అద్భుత శతకం.. ఆస్ట్రేలియా టార్గెట్ 384