Gujarat Giants Rely on Foreign Stars: ఆ నలుగురే..
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:26 AM
విదేశీ స్టార్ ప్లేయర్లపైనే ఎక్కువగా ఆధారపడిన జట్టు గుజరాత్ జెయింట్స్.. ఆష్లే గార్డ్‌నర్, బెత్ మూనీ, సోఫీ డివైన్, జార్జియా వేర్హమ్‌లు మూలస్తంభాలుగా జట్టును తీర్చిదిద్దారు. వీరి అనుభవం...
డబ్ల్యూపీఎల్ 3 రోజుల్లో
విదేశీ స్టార్ల బలంతో గుజరాత్ జెయింట్స్
విదేశీ స్టార్ ప్లేయర్లపైనే ఎక్కువగా ఆధారపడిన జట్టు గుజరాత్ జెయింట్స్.. ఆష్లే గార్డ్‌నర్, బెత్ మూనీ, సోఫీ డివైన్, జార్జియా వేర్హమ్‌లు మూలస్తంభాలుగా జట్టును తీర్చిదిద్దారు. వీరి అనుభవం, దూకుడుతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలని గుజరాత్ భావిస్తోంది. అయితే, చెప్పుకోదగ్గ భారత క్రికెటర్లు లేకపోవడం వారికి పెద్ద లోటే!
బలాలు: కెప్టెన్ గార్డ్‌నర్, బెత్ మూనీ, సోఫీ, జార్జియా జట్టుకు ప్రధాన బలం అనడంలో సందేహం లేదు. లీగ్‌లో మూనీ ఎంతో నిలకడైన ప్రదర్శన చేస్తుండగా.. గార్డ్‌నర్ తన పవర్ హిట్టింగ్‌తో అలరిస్తోంది. సోఫీ ఆల్‌రౌండ్ నైపుణ్యం జట్టుకు ప్లస్ కాగా.. వేర్హమ్ లెగ్ స్పిన్‌తోపాటు మంచి ఫినిషర్ కూడా. ఎక్కువ మంది మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉండడంతో ఈసారి టైటిల్ ఫేవరెట్ జట్లలో గుజరాత్‌ను ఒకటిగా పరిగణిస్తున్నారు. బౌలింగ్‌లో పేసర్ రేణుక, టిటాస్ సాధు ప్రధాన వనరులు.
బలహీనతలు: బలంగా చెప్పుకొన్న ఆ నలుగురు విదేశీ ఆటగాళ్లే జట్టుకు బలహీనతగా మారే అవకాశం ఉంది. గార్డ్‌నర్, మూనీ, డివైన్, వేర్హమ్‌లో ఎవరు గాయపడినా.. ఆ లోటును భర్తీ చేసే స్థాయి ప్లేయర్లు టీమ్‌లో లేరు. దీంతో టీమ్ సమతుల్యం దెబ్బతినే చాన్సులున్నాయి. ప్రత్యర్థులు భారత బ్యాటర్లను టార్గెట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. స్పెషలిస్ట్ విదేశీ బౌలర్లు లేరు. గత మూడు సీజన్లలోనూ జెయింట్స్ ప్రదర్శన తడబడుతూనే సాగింది.
జట్టు
విదేశీ: బెత్ మూనీ (వికెట్ కీపర్), ఆష్లే గార్డ్‌నర్ (కెప్టెన్), జార్జియా వేర్హమ్, సోఫియా డివైన్, డాని వ్యాట్, కిమ్ గార్త్.
స్వదేశీ: భారతి ఫుల్మాలి, కనికా అహూజా, ఆయుషి సోనీ, కాష్వీ గౌతమ్, తనూజ కన్వర్, టిటాస్ సాధు, రేణుక సింగ్, అనుష్క శర్మ, యాస్తిక భాటియా, శివాని సింగ్, హ్యాపీ కుమారి, రాజేశ్వరి గైక్వాడ్.
షెడ్యూల్
తేదీ ప్రత్యర్థి వేదిక
జనవరి 10 యూపీ నవీ ముంబై
జనవరి 11 ఢిల్లీ నవీ ముంబై
జనవరి 13 ముంబై నవీ ముంబై
జనవరి 16 బెంగళూరు నవీ ముంబై
జనవరి 19 బెంగళూరు వడోదర
జనవరి 22 యూపీ వడోదర
జనవరి 27 ఢిల్లీ వడోదర
జనవరి 30 ముంబై వడోదర
ఇవి కూడా చదవండి..
పీఓకే సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్
మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి