Share News

Suryakumar Yadav : సూర్యా.. పరుగుల గురించి మాత్రమే ఆలోచించు: రికీ పాంటింగ్

ABN , Publish Date - Jan 06 , 2026 | 07:56 AM

టీమిండియా టీ20 కెప్టెన్, స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ గత కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ సూర్యకు ఓ సలహా ఇచ్చాడు. ఔట్ అవ్వడం గురించే కాకుండా పరుగులు రాబట్టడం గురించి ఆలోచించాలని తెలిపాడు.

Suryakumar Yadav : సూర్యా.. పరుగుల గురించి మాత్రమే ఆలోచించు: రికీ పాంటింగ్
Suryakumar Yadav

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తుంది. భారత ఆటగాళ్లంతా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. పొట్టి ఫార్మాట్లో టీమిండియాను తలదన్నె జట్టే లేదన్నట్టు ప్రదర్శన కనుబరుస్తున్నారు. కానీ ఒక్కటే ప్రశ్న.. ఆ ఒక్క ప్లేయర్ గురించే! అతడే టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్. గత కొంత కాలంగా సూర్య ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. గత 24 ఇన్నింగ్స్‌ల్లో తన బ్యాట్ నుంచి ఒక్క హాఫ్ సెంచరీ కూడా రాలేదు. జట్టు పరంగా టీమిండియా అద్భుతం.. కెప్టెన్ పరంగా సూర్యకు పేరే పెట్టనవసరం లేదు. మరి వ్యక్తిగతంగా....! ఈ విషయం గురించే ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్(Ricky Ponting) మాట్లాడాడు. సూర్యకు ఓ సలహా ఇచ్చాడు.


‘సూర్య(Suryakumar Yadav ) ఫామ్ ఆశ్చర్యం కలిగిస్తోంది. అతడు మంచి ఆటగాడు. టీ20 క్రికెట్‌లో భారత జట్టు తరఫున నిలకడగా రాణించాడు. కానీ కొంతకాలంగా ఫామ్‌లో లేడు. తన అత్యుత్తమ ఫామ్‌లో సూర్య 8-10 బంతుల్లో ఊపందుకుంటాడు. ట్రావిస్ హెడ్ లాగే ఔట్ కావడం గురించి భయపడడు. ఔట్ కావడం గురించి కాకుండా పరుగులు చేయడం గురించి మాత్రమే ఆలోచించాలి. సూర్య నేనిచ్చే సలహా ఇదే. టీ20 క్రికెట్లో అతడు ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు మరోసారి నిరూపించుకోమని చెబుతున్నా’ అని రికీ పాంటింగ్ అన్నాడు.


ఇవి కూడా చదవండి:

Afghanistan Cricket: యువ బ్యాటర్ సంచలన రికార్డు.. ఒకే ఓవర్‌లో 48 పరుగులు

జో రూట్ అద్భుత శతకం.. ఆస్ట్రేలియా టార్గెట్ 384

Updated Date - Jan 06 , 2026 | 07:56 AM