Vaibhav Suryavanshi: మరో హాఫ్ సెంచరీ నమోదు.. తొలి 15 వేగవంతమైన అర్థశతకాల్లో 6 అతడి పేరిటే..!
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:19 PM
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వన్డేల్లో అదరగొడుతున్నాడు. తాజాగా సౌతాఫ్రికాతో మూడు యూత్ వన్డే సిరీస్‌లో భాగంగా బోనోని వేదికగా జరిగిన రెండో మ్యాచులో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. అయితే తొలి 15 వేగవంతమైన అర్ధశతకాల్లో ఆరు వైభవ్ పేరిటే ఉండటం విశేషం.
ఇంటర్నెట్ డెస్క్: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వన్డేల్లో అదరగొడుతున్నాడు. తాజాగా సౌతాఫ్రికాతో మూడు యూత్ వన్డే సిరీస్‌లో భాగంగా బోనోని వేదికగా జరిగిన రెండో మ్యాచులో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. మొత్తం మీద ఆ మ్యాచ్‌లో అతడు 68 పరుగులు (24 బంతుల్లో, 1 ఫోర్, 10 సిక్స్‌లు) సాధించాడు. ఇందులో 60 రన్స్ సిక్స్‌ల రూపంలోనే రావడం గమనార్హం. ఓవరాల్‌గా యూత్ వన్డేల్లో ఇది నాలుగో వేగవంతమైన హాఫ్ సెంచరీ. అయితే తొలి 15 వేగవంతమైన అర్ధశతకాల్లో ఆరు వైభవ్(Vaibhav Suryavanshi) పేరిటే ఉండటం విశేషం.
ఈ జాబితాలో తొలి స్థానంలో సౌతాఫ్రికాకు చెందిన స్టీవ్ స్టాల్క్ ఉన్నాడు. అతడు 27 జనవరి 2024లో స్కాట్లాండ్ అండర్-19 జట్టు మీద 13 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. రెండో స్థానంలో రిషభ్ పంత్ ఉన్నాడు. అతడు 1 ఫిబ్రవరి 2016లో నేపాల్ అండర్- 19 జట్టు మీద 18 బంతుల్లో 52 పరుగులు సాధించాడు. మూడో స్థానంలో అఫ్గనిస్థాన్‌కు చెందిన అజ్మతుల్లా ఒమర్జాయ్ ఉన్నాడు. అతడు 25 జనవరి 2018లో న్యూజిలాండ్ అండర్-19 జట్టు మీద 19 బంతుల్లో 54 పరుగులు చేశాడు.
వైభవ్ సూర్యవంశీ గతంలో 20, 24(రెండు సందర్భాల్లో), 25, 30 బంతుల్లో హాఫ్ సెంచరీలు సాధించాడు. సోమవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో 19 బంతుల్లో చేసిన అర్ధశతకంతో కలుపుకొని మొత్తం మీద ఆరుసార్లు వేగవంతమైన హాఫ్ సెంచరీలు నమోదు చేసి రికార్డ్ సృష్టించాడు.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్‌ను నిలబెట్టిన ధీరుడు.. హ్యాపీ బర్త్‌డే పాజీ!
నా ఫొటోలను మార్ఫింగ్ చేయొద్దు: భారత స్టార్ మహిళా క్రికెటర్