Share News

Ind Vs NZ: వన్డే సిరీస్‌కు సిద్ధమవుతున్న హిట్‌మ్యాన్.. ఫొటో వైరల్

ABN , Publish Date - Jan 06 , 2026 | 01:22 PM

న్యూజిలాండ్‌తో వన్డేల కోసం టీమిండియా వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ సిద్ధమవుతున్నాడు. నెట్స్‌లో చెమటోడ్చుతున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను హిట్‌మ్యాన్ తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Ind Vs NZ: వన్డే సిరీస్‌కు సిద్ధమవుతున్న హిట్‌మ్యాన్.. ఫొటో వైరల్
Rohit Sharma

ఇంటర్నెట్ డెస్క్: జనవరి 11 నుంచి న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. న్యూజిలాండ్‌తో వన్డేల కోసం టీమిండియా వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ సిద్ధమవుతున్నాడు. నెట్స్‌లో చెమటోడ్చుతున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను హిట్‌మ్యాన్ తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


రోహిత్ శర్మ(Rohit Sharma) 2025లో పలు మైలురాళ్లను అధిగమించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో 76 పరుగులు సాధించాడు. టీమిండియా విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే అతడి కెరీర్‌లోనే తొలిసారిగా ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ప్లేయర్‌గానూ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డ్‌ 2015 నుంచి షాహిద్‌ అఫ్రిది (351 సిక్స్‌లు) పేరిట ఉండేది. ప్రస్తుతం రోహిత్‌ శర్మ 279 వన్డేల్లో 355 సిక్స్‌లు బాదాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్‌గా రికార్డ్‌ సృష్టించాడు. రోహిత్‌ శర్మ తాజాగా.. విజయ్‌ హజారే ట్రోఫీలో ముంబయి తరపున ఆడాడు. సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో భారీ శతకం (155) బాదాడు. అయితే ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు.


రోహిత్‌ శర్మ ఇప్పటికే టీ20లు, టెస్ట్‌ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో కేవలం వన్డే క్రికెట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2027లో పాల్గొనడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.


ఇవి కూడా చదవండి:

భారత క్రికెట్‌ను నిలబెట్టిన ధీరుడు.. హ్యాపీ బర్త్‌డే పాజీ!

నా ఫొటోలను మార్ఫింగ్ చేయొద్దు: భారత స్టార్ మహిళా క్రికెటర్

Updated Date - Jan 06 , 2026 | 01:22 PM